రైలు వస్తుందని ప్లాట్ ఫామ్ పై ఎదురు చూసిన ప్రయాణికులు.. సమాచారం లేకుండానే వెళ్లడంతో.. స్టేషన్ మేనేజర్ దగ్గరికి

Published : Jun 26, 2023, 02:54 PM IST
రైలు వస్తుందని ప్లాట్ ఫామ్ పై ఎదురు చూసిన ప్రయాణికులు.. సమాచారం లేకుండానే వెళ్లడంతో.. స్టేషన్ మేనేజర్ దగ్గరికి

సారాంశం

కర్ణాటకలోని కలబురిగి స్టేషన్ నుంచి హైదరాబాద్ చేరుకోవాల్సిన ప్రయాణికులు రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైలు వచ్చే ప్లాట్ ఫామ్, టైమింగ్ ను అనౌన్స్ చేయకపోవడం వల్ల వారంతా రైలు మిస్ అయ్యారు. దీంతో స్టేషన్ మేనేజర్ పై వారికి క్షమాపణలు చెప్పారు. 

రైలు రావడం ఆలస్యమైనా, రద్దయినా ఈ విషయాలన్నింటినీ సిబ్బంది ప్రయాణికులకు రైల్వే స్టేషన్ లో ఎప్పటికప్పుడు తెలియజేస్తారు. అక్కడ ఉన్న డిజిటల్ డిస్ ప్లేలపై ప్రదర్శిస్తారు. మైక్ లో అనౌన్స్ చేస్తారు. కానీ కర్ఱాటణలోని కలబురిగి స్టేషన్ లో ఓ ప్రయాణికులకు వింత అనుభవం ఎదురయ్యింది. ఓ ప్లాట్ ఫారమ్ పై ప్రయాణికులు ఎదురుచూస్తుండగా.. మరో ప్లాట్ ఫారమ్ నుంచి వారికి తెలియకుండానే రైలు వెళ్లిపోయింది. దీంతో వారంతా ఇబ్బందికి గురయ్యారు.

దారుణం.. చేతబడి చేసిందనే నెపంతో వృద్ధురాలిని కొట్టి చంపిన గ్రామస్తులు..

కలబురగి రైల్వే స్టేషన్‌ నుంచి ప్రతీ రోజూ హుబ్బళి - సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ 1వ నెంబర్ ప్లాట్ ఫారం పై నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది. అయితే నిన్న (ఆదివారం) కూడా ఆ రైలు ఒకటో ప్లాట్ ఫారంపైకి రావాల్సి ఉంది. దీంతో ప్రయాణికులు అక్కడ ఎదురుచూస్తున్నారు. అయితే రైలు 6.32 గంటలకు వస్తుందని డిజిటల్ డిస్ ప్లేలో అధికారులు పేర్కొన్నారు. కానీ ఏ ప్లాట్ ఫారమ్ పై వస్తుందో చెప్పలేదు. కొంత సమయం తరువాత 10 నిమిషాలు ఆలస్యంగా రైలు వస్తుందని పేర్కొన్నప్పటికీ.. ఎక్కడికి వస్తుందో ప్రకటించలేదు. ఆఖరికి 6.45 గంటలకు డిజిటల్ డిస్ ప్లే నుంచి హుబ్బళి - సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరునే తీసివేశారు. 

గంటల తరబడి నిరీక్షించినా స్టాప్ లో ఆగడం లేదని.. బస్సు కిటికీని రాయితో పగులగొట్టిన మహిళ..

దీంతో ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. కొందరు స్టేషన్ లోని ఎంక్వైరీ కౌంటర్ వద్దకు వెళ్లారు. రైలు గురించి ఆరా తీశారు. దీంతో ఆ రైలు ఎప్పుడో వెళ్లిపోయిందని తీరిగ్గా సమాధానం ఇచ్చారు. దీంతో వందల సంఖ్యలో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ మేనేజర్ ఆఫీసుకు వెళ్లారు. ఎందుకిలా జరిగిందని ప్రశ్నించారు. పలు కారణాల వల్ల హుబ్బళి - సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్లాట్‌ఫామ్‌ను మార్చాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కానీ ఈ విషయాన్ని ప్రయాణికులకు చేరవేయడంలో అధికారులు విఫలమయ్యారని, అనౌన్స్ చేయడం మర్చిపోయారని తెలిపారు.

16 ఏళ్ల బాలికకు లైంగిక సంపర్కంపై నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఉంటుంది - మేఘాలయ హైకోర్టు

దీంతో ప్రయాణికులకు స్టేషన్ మేనేజర్ క్షమాపణలు కోరారు., హైదరాబాద్ కు వచ్చే ప్రయాణికులందరినీ హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా గమ్యస్థానానికి చేరవేశారు. కానీ దీనిపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా మంది సికింద్రబాద్ స్టేషన్ కు వెళ్లాల్సి ఉండగా.. చాలా ఆలస్యంగా నాంపల్లి స్టేషన్ కు చేరుకున్నారు. చాలా మంది ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకున్నప్పకీ.. నిలబడి ప్రయాణించాల్సి వచ్చింది. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్