కలిసుంటేనే అధికారం.. లేదంటే ప్రత్యర్ధులకే బలం: ఈపీఎస్, ఓపీఎస్‌లను ఉద్దేశిస్తూ శశికళ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Oct 17, 2021, 2:47 PM IST
Highlights

అన్నాడీఎంకే 50వ ఆవిర్భావ వేడుకల్లో శశికళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈపీఎస్, (EPS) ఓపీఎస్ (OPS) వర్గాలకు చిన్నమ్మ సందేశం ఇచ్చారు. మనం ఐక్యంగా వుంటేనే అధికారంలోకి వస్తామని.. విడిపోతే ప్రత్యర్ధులు బలపడతారని శశికళ హితవు పలికారు. 

తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ ఎంట్రీ ఇవ్వాలని చిన్నమ్మ శశికళ (sasikala) తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పన్నీరు సెల్వం, (panneerselvam) , పళని స్వామిలు (palaniswami) మాత్రం ఆమె తిరిగి అన్నాడీఎంకేలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే 50వ ఆవిర్భావ వేడుకల్లో శశికళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈపీఎస్, (EPS) ఓపీఎస్ (OPS) వర్గాలకు చిన్నమ్మ సందేశం ఇచ్చారు. మనం ఐక్యంగా వుంటేనే అధికారంలోకి వస్తామని.. విడిపోతే ప్రత్యర్ధులు బలపడతారని శశికళ హితవు పలికారు. 

కాగా, అసెంబ్లీ ఎన్నికలు (tamilnadu assembly elections) ( ముగిసిన తర్వాత ఇటీవలే ఆమె మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు పలుసార్లు హింట్ ఇచ్చారు. తాజాగా, మరోసారి అదే తరహా సంకేతాలనిచ్చారు. చెన్నైలో మెరీనాలోని జయలలిత మెమోరియల్‌కు (jayalalitha memorial) వెళ్లి భావోద్వేగానికి లోనయ్యారు. జయలలిత సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. ఈ మెమోరియల్‌కు ఏఐఏడీఎంకే జెండా పెట్టిన కారులో ఆమె వెళ్లారు. ఈ నేపథ్యంలో జయలలిత సమాధి వద్దకు వెళ్లడం రాజకీయవర్గాల్లో చర్చకు తెరతీసింది.

అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఏఐఏడీఎంకేను మళ్లీ సంస్కరించి జవసత్వాలు అందించే శక్తి సామర్థ్యం తనకు ఉన్నదని వీకే శశికళ అన్నారు. తన జీవితంలో నాలుగింట మూడు వంతుల కాలాన్ని జయలలితతోనే కలిసి ఉన్నారని చిన్నమ్మ తెలిపారు. మెమోరియల్ సందర్శించి నాలుగేళ్లు గడుస్తున్నదని, ఏఐఏడీఎంకే క్యాడర్‌ను జయలలిత, ఎంజీఆర్ రక్షిస్తారని వివరించారు.

Also Read:మళ్లీ వస్తున్నా.. చిన్నమ్మ హింట్.. ‘ఆస్కార్ వస్తుందేమో కానీ.. పార్టీలో ప్లేస్ రాదు’

జయలలిత సమాధిని చిన్నమ్మ సందర్శించడం AIADMK రుచించలేదు. మళ్లీ politicsలోకి వస్తారని ఆమె ప్రకటించడాన్నీ తిరస్కరించింది. ‘ఏఐఏడీఎంకేలో శశికళకు స్థానం లేదు. అమ్మ సమాధి దగ్గరకు ఆమె వెళ్లడం రాజకీయంగా ప్రభావితం చేయదు. రాజకీయాల్లో ఆమెకు స్థానం ఉండాలంటే ఏఎంఎంకేనే సరైన చోటు. ఆమె నటనకు ఆమెకు ఆస్కార్ అవార్డు వరిస్తుందేమో కానీ, ఏఐఏడీఎంకేలో మాత్రం చోటు దక్కదు’ అని పార్టీ ప్రతినిధి, మాజీ మంత్రి డీ జయకుమార్ వివరించారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ 2017లో అరెస్టయిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లు శిక్ష అనుభవించి అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆమె రాష్ట్రంలోకి వచ్చారు. ఆమె మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి, ఎన్నికల కంటే ముందు రాజకీయాలపై తనదైన ముద్ర వేస్తారని అందరూ అనుకున్నారు. పార్టీ కుచించుకుపోవడాన్ని ఎంతమాత్రం సహించబోనని ఆమె ఓ ప్రకటన చేసి తన వైఖరిని స్పష్టం చేశారు. కానీ, అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకే మిత్రపక్షం బీజేపీ నేతల వ్యూహంతో శశికళ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు. అంతేకాదు, ఎన్నికలకు ముందే ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

click me!