ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి పోస్టు: కోర్టుకెక్కిన శశికళ

By narsimha lodeFirst Published Feb 18, 2021, 3:09 PM IST
Highlights

ఎఐఎడిఎంకె నుండి బహిష్కరణకు గురైన శశికళ న్యాయపోరాటానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందుగానే ఎఐఎడిఎంకెలో కీలకపోస్టు కోసం ఆమె కోర్టును ఆశ్రయించింది.గత మాసంలో శశికళ జైలు నుండి విడుదలైంది. 

చెన్నై:ఎఐఎడిఎంకె నుండి బహిష్కరణకు గురైన శశికళ న్యాయపోరాటానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందుగానే ఎఐఎడిఎంకెలో కీలకపోస్టు కోసం ఆమె కోర్టును ఆశ్రయించింది.గత మాసంలో శశికళ జైలు నుండి విడుదలైంది. 

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం లకు వ్యతిరేకంగా చెన్నై కోర్టులో శశికళ గురువారం నాడు పిటిషన్ దాఖలు చేసింది.పళనిస్వామి, పన్నీరు సెల్వంల నేతృత్వంలో  నిర్వహించిన ఎఐఎడిఎంకె జనరల్ బాడీ సమావేశంలో తనను జనరల్ సెక్రటరీ పోస్టును తొలగించారని 2017లో కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇదే విషయమై తాజాగా కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణను ఈ ఏడాది మార్చి 15వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

also read:నాలుగేళ్ల తర్వాత చెన్నైకి శశికళ: భారీగా స్వాగతం పలికిన అభిమానులు

జయలలిత మరణించిన కొద్ది కాలానికే శశికళ ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అదే సమయంలో సీఎం పదవిని కూడా చేపట్టాలని ఆమె భావించారు. అదే సమయంలో అక్రమ ఆస్తుల కేసులో ఆమెకు కోర్టు శిక్ష విధించడంతో సీఎం పదవి చేపట్టలేదు.

జైలుకు వెళ్లే సమయంలో ఆమె ముఖ్యమంత్రిగా పళనిస్వామిని ఎంపిక చేసింది. అయితే శశికళ జైలుకు వెళ్లిన తర్వాత పన్నీరు సెల్వంతో కలిసి ఆయన శశికళపై తిరుగుబాటు చేశారు. ప్రధాన కార్యదర్శి పదవి నుండి శశికళను తొలగించారు.
 

click me!