వధువు డ్యాన్సులతో పెళ్లి ఊరేగింపు...విషాదం మిగిల్చింది..!

Published : Feb 18, 2021, 12:27 PM ISTUpdated : Feb 18, 2021, 12:58 PM IST
వధువు డ్యాన్సులతో పెళ్లి ఊరేగింపు...విషాదం మిగిల్చింది..!

సారాంశం

వధవు కూడా ఆనందంగా కళ్లకు కూలింగ్ క్లాసెస్ పెట్టుకొని  డ్యాన్స్ వేస్తోంది. సడెన్ గా ఆ పెళ్లి ఊరేగింపు ప్రమాదానికి గురైంది. 

మరికాసేపట్లో పెళ్లి జరగనుంది. అందరూ ఆనందంతో గంతులు వేస్తున్నారు. ఇక వధువు ఆనందానికి అయితే  హద్దులు లేవు. ఆర్భాటంగా వధువుని ఊరేగింపుగా తీసుకువెళుతున్నారు. వధవు కూడా ఆనందంగా కళ్లకు కూలింగ్ క్లాసెస్ పెట్టుకొని  డ్యాన్స్ వేస్తోంది. సడెన్ గా ఆ పెళ్లి ఊరేగింపు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ లో చోటుచేసుకోగా..  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌లో వధువు పెళ్ళి బృందం కళ్యాణ మండపానికి కారులో బయలుదేరారు. బంధువులు, మిత్రులందరు సంతోషంగా డాన్సులు చేస్తున్నారు. వధువు ప్రత్యేక కాస్టూమ్స్‌, సన్‌గ్లాసెస్‌ ధరించి కారులోని రూఫ్‌పైన నిలబడి ఉత్సాహంతో  స్టేప్పులు వేస్తుంది. కానీ..అకాస్మాత్తుగా ఒక కారు వేగంగా పెద్ద శబ్ధం చేసుకుంటు వధువు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. రెప్పపాటులో అక్కడి వాతావరణం మారిపోయింది. అప్పటి వరకు ఫుల్‌ జోష్‌తో డాన్స్‌లు చేస్తున్న వారు కాస్త, దూరంగా ఎగిరిపడ్డారు.

కాగా, ఈ ఘటనలో ఒకరు చనిపోగా, 12 మంది గాయపడ్డారు. నలుగురి పరిస్థితి  విషమంగా ఉంది. అదృష్టవశాత్తు పెళ్ళికూతురు మాత్రం దీని నుంచి క్షేమంగా బయటపడింది. దీనికి  సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతొంది. 

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ మూడు తెలుగు జిల్లాల్లో వర్షాలు, అక్కడ తుపాను బీభత్సం
Most Expensive Things: ఇండియన్స్ సృష్టించిన అత్యంత ఖరీదైన అద్భుతాలు ఏంటో తెలుసా?