బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన ఎయిర్ ఇండియా విమానం..!

By telugu news teamFirst Published Oct 5, 2021, 11:18 AM IST
Highlights

విమానం బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన విషయం తమ దృష్టికి వచ్చిందని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. 

ఆకాశంలో ఎగరాల్సిన  విమానం.. బ్రిడ్జి కింద ఇరుక్కోవడం ఎప్పుడైనా విన్నారా..? నిజంగా అలాంటి సంఘటనే  చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా విమానం..ఒకటి బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏమైందంటే.. సేవల నుంచి తప్పించిన విమానాన్ని ఎయిర్ ఇండియా స్క్రాప్ కింద అమ్మేసింది. దీనిని తరలిస్తున్న సమయంలో జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో వంతెన కింద ఇరుక్కుపోయింది.

విమానం బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన విషయం తమ దృష్టికి వచ్చిందని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆ విమానాన్ని గతేడాదే సేవల నుంచి తప్పించినట్టు చెప్పారు. విమానాన్ని తుక్కు కింద కొనుక్కున్న వారు శనివారం దాని తరలింపును చేపట్టినట్టు పేర్కొన్నారు. కాబట్టి ఈ విమానంతో ఎయిర్ ఇండియాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

 

click me!