రోడ్డు ప్రమాదం.. మామ, కోడలు దుర్మరణం..!

By telugu news team  |  First Published Oct 5, 2021, 11:01 AM IST

ఆదివారం సాయంత్రం పొద్దుపోయాక ఊరిలో తిరిగి ఇంటికి వస్తుండగా వెనుక నుండి వచ్చిన కారు వేగంగా ఢీకొంది. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


వేగంగా వచ్చిన కారు.. బైక్ ని ఢీ కొట్టడంతో మామ, కోడలు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన బెంళూరు సమీపంలో ని నెలమంగల తాలుకా మల్లరబాణవాడి గ్రామంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

గుల్బర్గా జిల్లా మాదాబకు చెందిన గీత (35), సూర్యకాంత్‌ (45) మృతి చెందారు. సూర్యకాంత్‌ కుటుంబం జీవనోపాధి కోసం నెలమంగల వచ్చి శాంతినగర్‌లో స్థిరపడ్డారు. కొత్తగా బైక్‌ కొన్న వీరు ఆదివారం సాయంత్రం పొద్దుపోయాక ఊరిలో తిరిగి ఇంటికి వస్తుండగా వెనుక నుండి వచ్చిన కారు వేగంగా ఢీకొంది. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Latest Videos

ఇదిలా ఉండగా.. అదే ప్రాంతంలో మరో యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న యువకుడు ఇంజెక్షన్‌ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన నెలమంగల పట్టణంలో చోటుచేసుకుంది. చిక్కమగళూరు కడూరుకు చెందిన సంజయ్‌ (19) నెలమంగలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున ఆస్పత్రిలోని రెస్ట్‌ రూంకి వెళ్లి ఎంతసేపయినా రాకపోవడంతో సిబ్బంది అనుమానం వచ్చి చూడగా సంజయ్‌ మత్తుమందు ఎక్కువ డోస్‌ తీసుకుని చనిపోయి ఉన్నాడు. దీనిపై అతని తల్లితండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

click me!