లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన: రోడ్లపైనే గుంజీలు తీయించిన పోలీసులు

By narsimha lode  |  First Published Apr 21, 2020, 1:19 PM IST

మహారాష్ట్రలోని పుణెలో లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించినవారిని పోలీసులు గుంజీలు తీయించారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినవారిలో మహిళలు కూడ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కువగా కరోనా కేసులు నమోదౌతున్న విషయం తెలిసిందే.


పుణె: మహారాష్ట్రలోని పుణెలో లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించినవారిని పోలీసులు గుంజీలు తీయించారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినవారిలో మహిళలు కూడ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కువగా కరోనా కేసులు నమోదౌతున్న విషయం తెలిసిందే.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను దేశ వ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ అమల్లో ఉన్నా కూడ  ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ పలువురు రోడ్లపైకి వస్తున్నారు.

Latest Videos

also read:ప్రియుడితో ఆలయంలో పెళ్లి: ప్రేమికులకు పోలీసుల అండ

అత్యవసర పరిస్థితుల్లో మినహా ఇతర సమయాల్లో రోడ్లపైకి రాకూడదని పోలీసులు కోరుతున్నారు. రోడ్లపై వచ్చిన వారిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు చేసిన హెచ్చరికలను కూడ  కొందరు పెడచెవిన పెడుతున్నారు.

పోలీసుల హెచ్చరించినా కూడ వినకుండా రోడ్లపైకి వచ్చినా వారిని పుణె పోలీసులు వినూత్నమైన శిక్షను విధించారు. రోడ్లపైకి వచ్చిన వారితో గుంజీలు తీయించారు పోలీసులు. పుణె పట్టణంలోని సింఘాడ్ రోడ్డుపై నిబంధనలు ఉల్లంఘించిన వారితో పోలీసులు గుంజీలు తీయించారు.మహారాష్ట్రలో ఇవాళ్టివరకు 4676 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 232 మంది మృతి చెందారు.

click me!