12 ఏండ్ల బాలిక ఇలాగే నడుచుకుంటూ తన సొంత ఊరికి పయనమై మార్గ మధ్యంలో నే కుప్పకూలి మరణించిన హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 10 మందితో కలిసి తన సొంత ఊరు చేరుకోవడానికి పయనమైన ఈ అమ్మాయి మార్గమధ్యంలో ఎండకు తాళలేక, దూరం నడవలేక కుప్పకూలింది.
కరోనా లాక్ డౌన్ వల్ల దేశమంతా స్థంభించిపోయింది విషయం తెలిసిందే. రవాణా మార్గాల నుండి మొదలు వ్యాపారాల వరకు అన్ని పూర్తిగా మూసివేయబడ్డాయి. ప్రజలంతా కూడా ఇండ్లకే పరిమితమయ్యారు. ఇదంతా బాగానే ఉన్నా... ఈ లాక్ డౌన్ వల్ల పేదలు, వలసకూలీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
వారంతా కనీసం తినడానికి తిండి దొరక్క, చిక్కుబడ్డ చోటే ఉండడానికి డబ్బులు లేక తమ సొంత ఊర్లకు వందల, వేళ కిలోమీటర్లు నడుచుకుంటూ కూడా చేరుకుంటున్నారు. ఇలా ఇప్పడికి నడుచుకుంటూ చేరుకోవడానికి ప్రయత్నించిన కొందరు మార్గ మధ్యంలో మరణించిన విషయం తెలిసిందే.
తాజాగా ఒక 12 ఏండ్ల బాలిక ఇలాగే నడుచుకుంటూ తన సొంత ఊరికి పయనమై మార్గ మధ్యంలో నే కుప్పకూలి మరణించిన హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 10 మందితో కలిసి తన సొంత ఊరు చేరుకోవడానికి పయనమైన ఈ అమ్మాయి మార్గమధ్యంలో ఎండకు తాళలేక, దూరం నడవలేక కుప్పకూలింది.
వివరాల్లోకి వెళితే... ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ ప్రాంతానికి చెందిన వలసకూలీలు తెలంగాణాలో మిర్చి పంట కోతకు వచ్చారు. కొత్త ముగియగానే ఇక్కడి నుండి తమ సొంత ఊర్లకు బయల్దేరారు.
అలా తెలంగాణ నుండి రవాణా సౌకర్యం లేకపోవడంతో నడుచుకుంటూ వెళ్లి మార్గమధ్యంలో మృతి చెందింది. ఇంకో గంటలో తన ఇంటికి చేరుకుంటాను అనగా కుప్పకూలిపోయింది. ఆమె శవాన్ని భద్రపరిచి సాంపిల్స్ ను కరోనా వైరస్ టెస్ట్స్ కోసం పంపించగా అవి నెగటీవ్ అని తేలాయి.
దానితో ఆ అమ్మాయి శవానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఆ రిపోర్టును పరిశీలించాల్సి ఉందని, బీజాపూర్ మీడియాకెల్ ఆఫీసర్ తెలుపుతున్నారు. ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహావేహాస్లను వెళ్లగక్కుతున్నారు.
డబ్బున్న ధనికులకు ఒక న్యాయం, పేదవారికి ఒక న్యాయమా అంటూ ఫైర్ అవుతున్నారు. చిక్కుకున్న ధనికులను వెనక్కు తీసుకుపోవడనికి ఏసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు, కానీ పేదలు మాత్రం ఇలా మరణించాల్సిందేనా అంటూ ఫైర్ అవుతున్నారు.