విల్లుపురం ఆత్మహత్యల కేసు : సైనైడ్ ఎలా దొరికిందంటే...

By AN TeluguFirst Published Dec 14, 2020, 12:13 PM IST
Highlights

చెన్నై విల్లుపురంలో ఐదురుగు కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరి ఆత్మహత్యలో సైనెడ్ కీలకంగా మారింది. స్వర్ణకారుడైన అరుణ్ తన దగ్గరున్న సైనెడ్ తో పిల్లలను చంపి, భార్య తను ఆత్మహత్య చేసుకున్నాడు.

చెన్నై విల్లుపురంలో ఐదురుగు కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరి ఆత్మహత్యలో సైనెడ్ కీలకంగా మారింది. స్వర్ణకారుడైన అరుణ్ తన దగ్గరున్న సైనెడ్ తో పిల్లలను చంపి, భార్య తను ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ నేపథ్యంలో సైనెడ్ అరుణ్ కి ఎలా లభించింది. అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్వర్ణకారులకు ఈ సైనెడ్ అంత సులభంగా ఎలా దొరుకుతుంది అని అక్కడి రిపోర్టర్లు ఆరా తీశారు. సైనైడ్ ఎక్కడ, ఎలా దొరుకుతుందని ఆరా తీస్తే.. చాలామంది భయంతో చెప్పడానికి నిరాకరించారు.

లాటరీ దెబ్బ : ముగ్గురు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య

కాకపోతే పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ స్వర్ణకారుడు తెలిపిన వివరాల ప్రకారం సైనైడ్ ఎవరికి పడితే వారికి దొరకదు. గోల్డ్ స్మిత్స్ అసోసియేషన్ జారీ చేసిన లైసెన్స్ ఉన్నవారికి మాత్రమే కొనుగోలు చేయడానికి వీలవుతుంది. ఎంత మొత్తంలో కొంటారనేదానికిమీద ఎలాంటి పరిమితులు లేవు. 

కాకపోతే సైనైడ్ కొనేవాళ్లు, అమ్మేవాళ్ల మీద నిఘా ఉంటుంది. దీన్ని బట్టే అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయి. సైనైడ్ స్థానంలో సల్ఫ్యూరిక్, నైట్రిక్ ఆమ్లాలు కూడా ఉపయోగిస్తారు. ఇవి చాలా ప్రమాదకరమైన రసాయనాలని ఆయన తెలిపారు.

బంగారు ఆభరణాల తయారీలో, పాలిష్, కరిగించడంలాంటి ప్రక్రియల్లో సైనైడ్ ను వాడతారు. విల్లుపురంలో అరుణ్ అతని కుటుంబం శుక్రవారం సైనైడ్ తాగి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 

click me!