అదుపు తప్పిన కారు: బండారు దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం

Published : Dec 14, 2020, 11:45 AM ISTUpdated : Dec 14, 2020, 12:59 PM IST
అదుపు తప్పిన కారు: బండారు దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం

సారాంశం

 హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ తృటిలో ప్రమాదం నుండి తప్పించుకొన్నారు. సోమవారం నాడు హైద్రాబాద్ నుండి సూర్యాపేటకు వెళ్తున్న సమయంలో చౌటుప్పల్ మండలం ఖైతాపురం సమీపంలో దత్తాత్రేయ ప్రయాణీస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దిగింది


చౌటుప్పల్: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ తృటిలో ప్రమాదం నుండి తప్పించుకొన్నారు. సోమవారం నాడు హైద్రాబాద్ నుండి నల్గొండకు వెళ్తున్న సమయంలో  యాదాద్రి భువనగిరి జిల్లా   చౌటుప్పల్ మండలం ఖైతాపురం సమీపంలో దత్తాత్రేయ ప్రయాణీస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దిగింది.

 

 

ఈ ప్రమాదంలో దత్తాత్రేయతో పాటు కారులో ప్రయాణీస్తున్నవారంతా క్షేమంగా ఉన్నారు. మరో కారులో దత్తాత్రేయ నల్గొండకు వెళ్లారు.విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. 

అతి వేగం కారణంగానే కారు పల్టీలు కొట్టిందా.. ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.హిమాచల్‌ప్రదేశ్ నుండి ఇటీవలనే గవర్నర్ దత్తాత్రేయ హైద్రాబాద్ కు వచ్చిన విషయం తెలిసిందే.స్టీరింగ్ బిగుసుకుపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొందని డ్రైవర్ చెప్పారు.ఈ దిశగా కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 పౌరసన్మానం సందర్భంగా  హైద్రాబాద్ నుండి నల్గొండకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. నల్గొండ జిల్లాతో ఉన్న అనుబంధం నేపథ్యంలో  బండారు దత్తాత్రేయకు బీజేపీ నేతలు పౌరసన్మానం చేయాలని భావించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.


 

PREV
click me!

Recommended Stories

UPI Update : ఫోన్ పే, గూగుల్ పే నుండి తెలియని నంబర్లకు డబ్బులు పంపితే .. ఏం చేయాలో తెలుసా?
Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?