Omicron: బెంగళూరు విమానాశ్రయంలో ఇద్దరు దక్షిణాఫ్రికా పౌరులకు కరోనా పాజిటివ్.. అప్రమత్తమైన అధికారులు

By telugu team  |  First Published Nov 27, 2021, 7:40 PM IST

ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్‌పై ఆందోళనలు వెలువడుతున్న తరుణంలో ఆ వేరియంట్ కనిపించిన దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు చేరిన ఇద్దరిలో కరోనా పాజిటివ్ అని తేలింది. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరిన 94 మందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ తేలడంతో వారిని వెంటనే క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. అది ఒమిక్రాన్ వేరియంటా? కాదా? అని తెలసుకోవడానికి వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. అప్పటి వరకు వారిని క్వారంటైన్‌లో ఉంచనున్నట్టు అధికారులు వెల్లడించారు.
 


బెంగళూరు: దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron) ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేపుతున్నది. ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా(South Africa) నుంచి బెంగళూరు(Bengaluru)లోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు చేరిన ఇద్దరు సౌత్ ఆఫ్రికా పౌరుల్లో కరోనా పాజిటివ్(Corona Positive) అని తేలింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. వారిద్దరినీ వెంటనే క్వారంటైన్(Quarantine) సెంటర్‌కు పంపారు. అయితే, వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. ఈ సీక్వెన్సింగ్ ద్వారా కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ వారికి సోకిందా? లేదా? అనే విషయం తెలియనుంది. ఈ ఫలితాలు 48 గంటల్లో వస్తాయని అధికారులు తెలిపారు. అప్పటి వరకు వారు క్వారంటైన్‌లోనే ఉంటారని బెంగళూరు రూరల్ డిప్యూటీ కమిషనర్  కే శ్రీనివాస్ శనివారం వెల్లడించారు.

కరోనా హై రిస్కు ఉన్న దేశాల నుంచి 584 మంది పౌరులు బెంగళూరుకు వచ్చినట్టు కే శ్రీనివాస్ వెల్లడించారు. ఇందులో కేవలం దక్షిణాఫ్రికా నుంచే వచ్చిన వారు 94 మంది ఉన్నట్టు తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వారందరికీ కరోనా టెస్టు చేశారు. ఈ టెస్టుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలినట్టు వివరించారు. దీంతో వెంటనే వారిని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. అయితే, వారికి సోకింది కరోనా వైరస్ నూతన వేరియంట్ ఒమిక్రానేనా? కాదా? అనే విషయం ఇప్పటికైతే తెలియదని, అది తేల్చడానికి టెస్టులకు పంపామని అన్నారు. 48 గంటల్లో ఆ పరీక్ష ఫలితాలు వస్తాయని, అప్పటి వరకు వారు క్వారంటైన్‌లోనే ఉంటారని చెప్పారు.

Latest Videos

undefined

Also Read: Omicron: మన దేశంలో మళ్లీ ఆంక్షలు షురూ..! గుజరాత్, ముంబయిలో ‘టెస్టులు, క్వారంటైన్’ ఆదేశాలు

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్‌పై ఆందోళనలు వెలువడుతుండటంతో ఆ వేరియంట్ కేసులు ఉన్న దేశాల నుంచి వస్తున్న వారి పట్ల కచ్చితంగా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల అమలును పరిశీలించడానికి బెంగళూరు రూరల్ డిప్యూటీ కమిషనర్ కే శ్రీనివాస్ బెంగళూరు ఎయిర్‌పోర్టుకూ వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరు దక్షిణాఫ్రికా పౌరుల్లో కరోనా పాజిటివ్ తేలిందని అన్నారు.

క్యాబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబా, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్, పీకే మిశ్రాలతో ప్రధాని మోడీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సుమారు రెండు గంటలపాటు జరిగింది. ఇందులో ప్రస్తుతం దేశంలోని పరిస్థితులను ప్రధానికి అధికారులు వివరించారు. కొత్త వేరియంట్‌ను ఆందోళనకారక వేరియంట్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం గుర్తించడం, కొత్త వేరియంట్‌తో భారత్, సహా ఇతర దేశాలపై పడే ప్రభావాలనూ ప్రధానికి అధికారులు తెలియజేసినట్టు ఓ అధికారిక ప్రకటన వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్ దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, హాంకాంగ్, ఇజ్రాయెల్ దేశాల్లో కనిపించింది. కొత్త వేరియంట్ కలకలం రేపుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని కీలక సూచనలూ చేశారు.

Also Read: Omicron: కొత్త వేరియంట్‌పై పీఎం మోడీ సమీక్ష.. ప్రధాని చెప్పిన విషయాలివే

కొత్త వేరియంట్ విజృంభించే ముప్పు ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అంతర్జాతీయ విమాన సేవలపై ఆంక్షలు ఎత్తేయాలనే నిర్ణయాన్ని సమీక్షించాలనీ ఈ సందర్భంగా ప్రధాని మోడీ సూచనలు చేశారు. ప్రజలూ మరింత జాగ్రత్తగా మసులుకోవాలని తెలిపారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. అంతేకాదు, విదేశాల నుంచి వచ్చే వారికి టెస్టులు నిర్వహించడంపై జాగ్రత్త వహించాలని అధికారులకు తెలిపారు. ముఖ్యంగా కరోనా కేసుల రిస్క్ ఉన్న దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వివరించారు.

click me!