పెళ్లైన రెండు నెలలకే.. సెక్రటేరియట్ ఉద్యోగి.. నిండు జీవితాన్ని బలితీసుకున్న రోడ్డు ప్రమాదం..

By AN TeluguFirst Published Nov 2, 2021, 1:27 PM IST
Highlights

రెండు నెలల క్రితం అతనికి చాపిరి తండాకు చెందిన ఝాన్సీతో వివాహం అయ్యింది. సోమవారం ఉదయం విధులకు వెళ్లిన రాజశేఖర్ నాయక్, వీఆర్వో అనుమతితో ద్విచక్ర వాహనం మీద కల్యాణ దుర్గంలోని ఆర్డీవో కార్యాలయానికి బయలుదేరారు. 

బెళుగుప్ప : మండలంలోని నారింజ గుండ్లపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకున్న ప్రమాదంలో సచివాలయ ఉద్యోగి దుర్మరణం పాలయ్యాడు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెళుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి తండాకు చెందిన పార్వతీబాయి, కృష్ణానాయక్ దంపతుల పెద్ద కుమారుడు రాజశేఖర్ నాయక్ (26), శ్రీరంగాపురం Secretariatలో సర్వేయర్ గా పనిచేస్తున్నాడు. 

రెండు నెలల క్రితం అతనికి చాపిరి తండాకు చెందిన ఝాన్సీతో వివాహం అయ్యింది. సోమవారం ఉదయం విధులకు వెళ్లిన రాజశేఖర్ నాయక్, వీఆర్వో అనుమతితో ద్విచక్ర వాహనం మీద కల్యాణ దుర్గంలోని ఆర్డీవో కార్యాలయానికి బయలుదేరారు. 

గుండ్లపల్లి సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా రాయదుర్గం వైపు వెళ్తున్న కారు (ఏపీ 02 బీఆర్0735) వేగాన్ని డ్రైవర్ నియంత్రించుకోలేక ఢీ కొనడంతో Accident అయ్యింది.  ద్విచక్ర వాహనంతో పాటు రాజశేఖర్ నాయక్ నీ 80 మీటర్ల దూరం కారు లాక్కెళ్లింది. 

ఘటనలో రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్రవాహనం నుజ్జునుజ్జుయ్యింది. సమాచారం అందుకున్న బెళుగుప్ప ఎస్ఐ రుషేంద్ర బాబు అక్కడికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ పెద్దన్న, ఎంపీడీఓ ముస్తాఫా కమాల్ బాషా అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు. 

భార్య, పిల్లలను చంపేసి.. పదో అంతస్తు నుంచి కిందకు దూకి..!

మరో ఘటనలో.. ఇంకో విషాదం....
కేరళలోని కొచ్చిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో.. 2019 మాజీ మిస్ కేరళ అన్ని కబీర్ (25), రన్నరప్ డాక్టర్ అంజన షాజన్(26) లు దుర్మరణం చెందారు. కాగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరూ కారులో ఉండగా.. కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి మాత్రం తీవ్రం గాయపడినట్లు తెలుస్తోంది. అతను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ తెల్లవారుజామున కొచ్చిలో జరిగిందీ ఘటన. హైవేపై వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఒక్కసారిగా రోడ్డుపక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది.   స్కూటర్‌ను తప్పించే క్రమంలో డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోయాడని పోలీసులు పేర్కొన్నారు. 

తీవ్రంగా గాయపడిన అన్సి కబీర్, డాక్టర్ అంజన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రమాద సమయంలో కారులోని వారు సీటు బెల్టు ధరించినదీ, లేనిదీ దర్యాప్తు, ఫోరెన్సిక్ సైంటిస్టులు తేలుస్తారన్నారు. అలాగే, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. 

తిరువనంతపురం జిల్లాకు చెందిన అన్సి 2019లో మిస్ కేరళ పోటీల్లో విజేతగా నిలవగా, ఈ ఏడాది మిస్ సౌత్ ఇండియా ఎంపికైంది. త్రిసూర్‌కు చెందిన డాక్టర్ అంజన షాజన్ కూడా మోడలింగ్‌ను కెరియర్‌గా ఎంచుకున్నారు. అన్సి, అంజన ఇద్దరూ మంచి స్నేహితులని వారి బంధువులు తెలిపారు. 

click me!