Bypoll Results 2021: బీజేపీకి భంగపాటు?.. పశ్చిమ బెంగాల్‌లో ఆ రెండు సీట్లూ టీఎంసీ ఖాతాలోకి..!

By telugu teamFirst Published Nov 2, 2021, 12:59 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి మరో భంగపాటు తప్పేలా లేదు. ఈ రాష్ట్రంలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో ఖాళీ అయిన రెండు స్థానాలూ ఇందులో ఉన్నాయి. కానీ, ఈ సారి ఆ రెండూ బీజేపీకి దక్కేలా లేవు. మొత్తం నాలుగు స్థానాలనూ తృణమూల్ కాంగ్రెస్సే తన ఖాతాలో వేసుకునేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
 

కోల్‌కతా: West Bengal ఇప్పుడు BJP వర్గాల్లో సింహస్వప్నం. ఈ ఏడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శక్తియుక్తులను ఒడ్డి పోరాడింది. కేంద్రమంత్రులు, సీనియర్ నేతలు వందిమాగదులు వచ్చి ప్రచారం చేశారు. కానీ, కమలం పార్టీకి పరాజయం తప్పలేదు. మమతా బెనర్జీ సారథ్యం విజయవంతమైంది. నందిగ్రామ్‌లో ఆమె పరాజయం పాలైనా.. TMCకి అఖండ విజయాన్ని ఒంటిచేత్తో సంపాదించి పెట్టారు. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటున్నప్పటికీ ఈ ఘోర పరాజయం స్థిమితపడనీయలేదు. గతనెల జరిగిన ఉపఎన్నికలోనూ భంగపాటు తప్పేలా లేదు.

పశ్చిమ బెంగాల్‌లో నాలుగు స్థానాల్లో Bypolls జరిగాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్న రెండు స్థానాల్లోనూ పోలింగ్ జరిగింది. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నిశిత్ ప్రమాణిక్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో దిన్హాతా సీటులో ఉపఎన్నిక అనివార్యమైంది. మరో శాంతిపూర్‌ అసెంబ్లీ స్థానానికి బీజేపీ ఎంపీ జగన్నాథ్ సర్కార్ రాజీనామా చేశారు. అందులోనూ నిశిత్ ప్రమాణిక్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన దిన్హాతా బీజేపీకి కంచుకోటగా భావించే కూచ్‌బెహార్‌కు చెందినదే. తాజా ఉపఎన్నికలో ఈ రెండు స్థానాల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ ముందంజలో ఉన్నది. దీంతో బీజేపీ వర్గాల్లో నిరాశ, టీఎంసీ వర్గాల్లో ఆనందోత్సహాలు మొదలయ్యాయి.

Also Read: Bypoll Results 2021 Live Updates: 3 లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

దిన్హాతాలో టీఎంసీ అభ్యర్థి ఉదయన్ గుహా ఇప్పటికే 91వేల ఓట్లతో ముందంజలో ఉన్నారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్‌ కార్యకర్తలు సంబురాలు మొదలెట్టారు. ఇది బీజేపీకి దెబ్బగానే భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ 200 స్థానాలు గెలుచుకుంటామని టార్గెట్ పెట్టుకున్న బీజేపీ అప్పుడు ఘోర పరాజయం చవిచూసింది. తాజా ఉపఎన్నికలోనూ మరో రెండు సీట్లనూ కోల్పోయి ఓటమి భారాన్ని మరింత పెంచుకున్నట్టయింది.

భవానీపూర్‌లో గెలుపొంది రాజీనామా చేసిన టీఎంసీ ఎమ్మెల్యే సోవందేబ్ ఛటోపాధ్యాయ్.. ఖర్దాహ్ సీటు నుంచి పోటీ చేస్తున్నారు. నందిగ్రామ్‌లో ఓడిపోయిన మమతా బెనర్జీ మళ్లీ పోటీ చేయడానికి భవానీపూర్‌ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. ఈ సీటులోనూ సోవందేబ్ ఛటోపాధ్యాయ్ అగ్రభాగాన ఉన్నారు. బీజేపీ కనీసం గట్టి పోటీ ఇవ్వకుండా మూడో స్థానానికి పరిమితమైంది. సీపీఎం కంటే వెనుకబడి మూడో స్థానంలో కొనసాగుతున్నది.

తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్య సంఖ్య ప్రస్తుతం 213. తాజాగా మరో నాలుగు సీట్లూ టీఎంసీ ఖాతాలోకే చేరేలా పరిస్థితులు ఉన్నాయి. ఈ సీట్లూ గెలుచుకుని బలమైన శక్తిగా టీఎంసీ పరిణమిస్తున్నది. ఈ పరాజయం బీజేపీ శ్రేణుల్లో మరింత నైరాశ్యాన్ని నిలిపేలా ఉన్నాయి.

గత నెల 30వ తేదీన అసోంలోని ఐదు అసెంబ్లీ స్థానాలు, West Bengal లో నాలుగు స్థానాలు,. మధ్యప్రదేశ్ లో మూడు స్థానాలు, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, బీహార్ రాష్ట్రాల్లోని రెండు అసెంబ్లీ స్థానాలు, కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరాం, తెలంగాణలోని ఒక్కొక్క అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి.

Also Read: Huzurabad bypoll Result 2021:ఆరో రౌండ్‌లోనూ వెనుకబడిన గెల్లు శ్రీనివాస్ యాదవ్

దాద్రానగర్ హవేలీ, హిమాచల్‌ప్రదేశ్ లోని మండి, మధ్యప్రదేశ్ లోని ఖండ్వా ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.ఈ మూడు స్థానాల నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు అభ్యర్ధులు మరణించడంతో  ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.

click me!