Vijayakanth:డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో ఆయన చిక్సిత పొందుతున్న చెన్నైలోని మియాట్ ఆస్పత్రికి డీఎండీకే నేతలు, కార్యకర్తలు క్యూ కట్టారు. అదే సమయంలో ఆస్పత్రి దగ్గర భారీగా పోలీసులను మోహరించినట్టు తెలుస్తోంది.
Vijayakanth: ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు, కెప్టెన్ విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా చెన్నైలోని చెన్నైలోని మియాట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా గత రెండు రోజులు ఆయన ఆరోగ్యం మరింత విషమించినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో సోషల్ మీడియాలో కెప్టెన్ విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఈ క్రమంలో బుధవారం (నవంబర్ 29) నాడు విజయకాంత్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని, అయితే గత 24 గంటల్లో ఆయన పరిస్థితి స్థిరంగా లేదని అన్నారు. ఆయనకు పల్మనరీ చికిత్సలో సహాయం కావాలని, ఆయన త్వరగా కోలుకుంటాడని తాము ఆశిస్తున్నామని, అయితే.. ఈ చికిత్సలో భాగంగా ఆయన ఇంకా 14 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉందని ఆస్పత్రి సిబ్బంది హెల్త్ బులెటిన్ లో తెలిపారు. అదే సమయంలో విజయ కాంత్ సతీమణి ప్రేమలతా సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేస్తూ.. కెప్టెన్ ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలో ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని, అందరినీ కలుసుకుంటారని చెప్పుకొచ్చారు. అయితే.. ఈ వీడియో విడుదలైన తరువాత విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. విజయ్ కాంత్ చిక్సిత పొందుతున్న మియాట్ ఆస్పత్రి డీఎండీకే నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మియాట్ ఆస్పత్రి దగ్గర భారీగా పోలీసుల మోహరించినట్లు తెలుస్తోంది.