Supreme Court: మహిళపై రేప్ కేసు పెట్టొచ్చా.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే?

By Mahesh KFirst Published Dec 2, 2023, 7:13 PM IST
Highlights

మహిళపై రేప్ కేసు పెట్టొచ్చా? అత్యాచార కేసులో ఆమె పై అభియోగాలు దాఖలు చేయవచ్చా? అనే ప్రస్తావన సుప్రీంకోర్టులో వచ్చింది. కోడలు పెట్టిన రేప్ కేసులో ముందస్తు బెయిల్ కోసం అత్త దాఖలు చేసిన పిటిషన్ విచారిస్తుండగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.
 

న్యూఢిల్లీ: రేప్ కేసు అంటే సాధారణంగా మహిళ తరఫున ఫిర్యాదు అందితే.. ఆరోపణలు ఎదుర్కొన్న పురుషుడిపై పోలీసులు కేసు నమోదు చేస్తారు. రేప్ కేసుల్లో నిందితుడు పురుషుడిగా, బాధితురాలిగా మహిళ ఉంటారు. కానీ, మహిళపై రేప్ కేసు పెట్టొచ్చా? రేప్ కేసులో మహిళపై అభియోగాలు మోపవచ్చునా? ఈ ప్రశ్నలు సుప్రీంకోర్టు దృష్టికి వచ్చాయి. ఈ ప్రశ్నలను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.

కోడలు.. అత్తపై, మరిదిపై పెట్టిన అత్యాచార కేసు విచారణలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. 61 ఏళ్ల మహిళ ఈ పిటిషన్ ఫైల్ చేయగా.. సుప్రీంకోర్టు పరిశీలిస్తామని చెప్పింది. దీనిపై తమ స్పందన తెలియజేయాలని పంజాబ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు పంపింది.

Latest Videos

పంజాబ్‌కు చెందిన 61 ఏళ్ల మహిళ పెద్ద కొడుకు అమెరికాలో, చిన్న కొడుకు పోర్చుగల్‌లో ఉంటున్నారు. పెద్ద కొడుకు పెళ్లిని గతేడాది ఓ యువతితో పెళ్లి చేశారు. అది కూడా వర్చువల్‌గానే. పెళ్లి కొడుకు అమెరికాలోనే.. పెళ్లి కూతురు ఇండియాలోనే ఉండి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఆమె అత్తతో కలిసి ఉంటున్నది. కానీ, పెద్ద కొడుకు అమెరికా నుంచి ఇంటికి రాలేడు. కానీ, పోర్చుగల్ నుంచి చిన్న కొడుకు ఇంటికి వచ్చి వారితో ఉన్నాడు. మళ్లీ జనవరిలో వెళ్లిపోయాడు.

Also Read : Bandla Ganesh: ఎగ్జిట్ పోల్ కంటే ముందే ‘బండ్ల’ పోల్.. సీఎం ఆయనే: బండ్ల గణేశ్ మనసులో మాట

చిన్న కొడుకు పోర్చుగల్‌కు వెళ్లిపోయిన తర్వాత కొన్నాళ్లకు కోడలు.. తన అత్త, మరిదిపై కేసు పెట్టింది. తనపై అత్యాచారం జరిగిందని కేసు పెట్టింది. నగ్న ఫొటోలు చూపించి అతను తనపై అత్యాచారం చేశాడని, ఈ విషయం బయటకు చెప్పొద్దని అత్త బెదిరించిందని ఆమె ఆరోపించింది.

ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం 61 ఏళ్ల మహిళ దరఖాస్తు చేసుకుంది. ఈ పిటిషన్‌ను దిగువ కోర్టు కొట్టివేశాయి. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారిస్తుండగా మహిళపై రేప్ కేసు పెట్టొచ్చా? అనే అంశం ప్రస్తావనకు వచ్చింది.

click me!