చెన్నైలో దారుణం జరిగింది. ఓ హోటల్‌కు గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకెళ్లిన బాయ్‌ఫ్రెండ్.. ఆమెను అక్కడే తన టీషర్ట్‌తో గొంతు నులిమి చంపేశాడు. ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న వీరికి.. వీరి టీనేజీలోనే ఒక బేబీ పుడితే దత్తతకు ఇచ్చారు.
చెన్నై: తమిళనాడులో దారుణం జరిగింది. తన గర్ల్ ఫ్రెండ్‌ను తీసుకుని హోటల్‌కు వెళ్లాడు. అక్కడే ఓ గొడవ జరిగింది. అంతే.. తన టీషర్ట్‌తో గర్ల్‌ఫ్రెండ్ గొంతు నులిమాడు. విలవిల్లాడుతూ ఆమె కుప్పకూలిపోయింది. ఆమె మరణించిన తర్వాత డెడ్ బాడీని ఫొటో తీసి ఆ క్రూరుడు తన వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు. ఆయన మిత్రులు వాట్సాప్ స్టేటస్ చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం చెన్నైలోని ఓ హోటల్ రూమ్‌లో జరిగింది. నిందితుడిని ఆశిక్‌గా గుర్తించారు.
మరణించిన యువతి నర్సింగ్ స్టూడెంట్. సెకండ్ ఇయర్ చదువుతున్నది. ఆమె ఆశిక్‌తో ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నది. నగరంలోని ఓ గది అద్దెకు తీసుకుని కలిసి ఉంటున్నారు. గత మూడు రోజులుగా ఆమె కాలేజీకి రాలేదు. దీంతో మిత్రుల్లోనూ అనుమానాలు కలిగాయి. ఆమె గురించి ఆరా తీయగా.. ఆమె బాయ్ ఫ్రెండ్ ఆశిక్ చెన్నై వచ్చినట్టు తెలిసింది. అతను హోటల్ రూమ్ బుక్ చేసి ఆమెను అక్కడికి తీసుకెళ్లాడు.
అయితే, ఆశిక్ వాట్సాప్ స్టేటస్‌లో ఆమె డెడ్ బాడీ చూసి వారంతా ఖంగుతిన్నారు. చెన్నై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆమె డెడ్ బాడీని తొందరగానే ట్రేస్ చేయగలిగారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆశిక్‌ను ట్రాక్ చేసి అరెస్టు చేశారు
Also Read : Telangana Election Results: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వద్దకు ఏపీ సీఎం జగన్ దూత?
దర్యాప్తు లో ఆశిక్ తన నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. తనకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉన్నదని ఆమె ఆరోపించడంతో తాను ఆగ్రహానికి గురయ్యానని, అందుకే టీ షర్ట్‌తో ఆమె గొంతు నులిమి చంపేశానని అంగీకరించినట్టు తెలిసింది.
వీరిద్దరూ టీనేజీలో ఉండగానే వీరికి ఒక పాప జన్మించిందని, ఆ బేబీని దత్తతకు ఇచ్చినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.