భర్త మీద భార్య ప్రేమ.. నెట్టింట వైరల్ వీడియో..!

Published : Feb 20, 2023, 10:07 AM IST
  భర్త మీద భార్య ప్రేమ.. నెట్టింట వైరల్ వీడియో..!

సారాంశం

తన భర్త పట్ల చూపించిన ప్రేమకు అందరూ ఫిదా అవుతున్నారు. ఇది కదా ప్రేమ అంటే అని కామెంట్స్ చేస్తున్నారు. 


భార్యభర్తల మధ్య ప్రేమ, అనురాగం ఉంటేనే ఆ బంధం చివరి వరకు ఆనందంగా సాగుతుంది. అయితే... ఈ జంట మాత్రం..అన్యోన్యతకు మారుపేరు అని చెప్పొచ్చు. ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ కాగా... అందులో వృద్ధ మహిళ... తన భర్త పట్ల చూపించిన ప్రేమకు అందరూ ఫిదా అవుతున్నారు. ఇది కదా ప్రేమ అంటే అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూసినప్పుడు ఆనందం, బాధ ఒకేసారి కలుగుతాయి. ఎంత స్వచ్ఛమైన ప్రేమ అనే భావన కలుగుతుంది.

 

వీడియోలో వృద్ధ మహిళ తన చేతులతో తన భర్తకు ఆహారం తినిపిస్తోంది. ఆయన తినలేని స్థితిలో ఉండటంతో..... భార్య ప్రేమగా తినిపించడం గమనార్హం. దీనిని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా... వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తే.. ఖచ్చితంగా మీకు నిజమైన ప్రేమపై నమ్మకం కలిగిస్తుంది.

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను అబా జియోన్ అనే యానిమేటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. చిన్న క్లిప్‌లో, ఒక వృద్ధ మహిళ తన భర్తతో కలిసి ఒక ఫంక్షన్‌లో చూడవచ్చు. ఆమె తన చేతులతో తన భర్తకు ఆహారం తినిపిస్తోంది. ఈ వీడియో కి దాదాపు 11 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?