ఢిల్లీలోని దేవాలయం సమీపంలో గోవధ.. 22 ఏళ్ల యువకుడి అరెస్టు...

Published : Feb 20, 2023, 10:04 AM IST
ఢిల్లీలోని దేవాలయం సమీపంలో గోవధ.. 22 ఏళ్ల యువకుడి అరెస్టు...

సారాంశం

ఢిల్లీలో మాంసాన్ని విక్రయించేందుకు దేవాలయం సమీపంలో గోవులను వధించిన 22 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఢిల్లీ : ఉత్తర ఢిల్లీలోని గులాబీ బాగ్ ప్రాంతంలో గోవధకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై 22 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. ఫిబ్రవరి 7న గులాబీ బాగ్‌లోని రోష్నారా అండర్‌పాస్ వద్ద ఖాళీ స్థలం దగ్గర గోహత్య ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటనాస్థలం నుంచి పశువుల అవశేషాలను సేకరించి ప్రభుత్వ పశువైద్యశాలకు తరలించారు.

ప్రాథమిక దర్యాప్తు తరువాత, నిందితుడిని శనివారం ఢిల్లీ వ్యవసాయ పశువుల సంరక్షణ చట్టం, ఇండియన్ పీనల్ కోడ్, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అరెస్టు చేశారు. నిందితుడిని బాబర్‌పూర్‌లోని జనతా మజ్దూర్ కాలనీకి చెందిన అఫ్తాబ్ అహ్మద్ అలియాస్ లుక్మాన్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

యువకుడిని తలకిందులుగా.. చెట్టుకు వేలాడదీసి చిత్రహింసలు.. వీడియో వైరల్.. కారణం ఏంటంటే...

నిందితుడు తన సహచరులు అర్కామ్, సలీమ్, మారుఫ్,అల్తామాస్‌తో కలిసి పలు సందర్భాల్లో ఆవు మాంసాన్ని విక్రయించేందుకు వాటిని వధించినట్లు వెల్లడించినట్లు వారు తెలిపారు. ఫిబ్రవరి 6, 7 మధ్య రాత్రి, తన సహ నిందితులతో కలిసి హోండా సిటీ కారులో గులాబీ బాగ్ ప్రాంతానికి వెళ్లాడు. ఆ సమయంలో అతనే స్వయంగా వాహనం నడుపుతున్నాడు.

సహ నిందితులు దారిలో ఓ ఆవును పట్టుకుని గులాబీ బాగ్‌లోని ఖాళీ స్థలంలో వధ కోసం తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన స్థలం ఆలయానికి ఆనుకొని ఉన్నాయని వారు తెలిపారు. ఢిల్లీ పోలీసులలోని రోహిణి, ఔటర్ నార్త్ జిల్లాల్లో గోహత్య కేసుల్లో కూడా వారు ప్రమేయం ఉన్నారు. అహ్మద్‌పై 2022లో వెల్‌కమ్, శాస్త్రి పార్క్ పోలీస్ స్టేషన్‌లలో దోపిడీ, స్నాచింగ్, ఆయుధాల చట్టం కింద కేసులు నమోదయ్యాయి.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?