యువకుడిని తలకిందులుగా.. చెట్టుకు వేలాడదీసి చిత్రహింసలు.. వీడియో వైరల్.. కారణం ఏంటంటే...

Published : Feb 20, 2023, 08:02 AM IST
యువకుడిని తలకిందులుగా.. చెట్టుకు వేలాడదీసి చిత్రహింసలు.. వీడియో వైరల్.. కారణం ఏంటంటే...

సారాంశం

గ్రామంలోని యువతితో సంబంధం పెట్టుకున్నాడని ఓ యువకుడి పట్ల అమానుషంగా ప్రవర్తించారు కొందరు. యువకుడికి తలకిందులుగా చెట్టుకు వేలాడదీసి చిత్రహింసలు పెట్టారు. 

రాజస్థాన్ : రాజస్థాన్లోని ఉదయపూర్ లో ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన యువతితో ఓ యువకుడు సంబంధం పెట్టుకున్నాడని కొంతమంది ఆరోపణలు చేశారు.  అంతేకాదు కొందరు దుండగులు ఆ యువకుడిని ఈ ఆరోపణల నేపథ్యంలో తీవ్రంగా హింసించారు. ఆ యువకుడిని తాళ్లతో కట్టి  చెట్టుకు తలకిందులుగా వేలాడదీశారు. గ్రామానికి చెందిన ఓ యువతితో సన్నిహితంగా ఉంటున్నాడని..  ఆమెను కిడ్నాప్ చేశాడని ఆ యువకుడి మీద గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

దీనికి సంబంధించిన ఓ వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియోలో యువకుడిని చెట్టుకి తలకిందులుగా వేలాడదీసి కొడుతున్న  దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియో బయటకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. వీడియోలో చూపించిన బాధిత యువకుడిని.. ఆ ఘటనకు కారణమైన.. యువకుడితో సంబంధం ఉందని ఆరోపిస్తున్న యువతిని కూడా పోలీసులు విచారణ  చేసి..  వారి వివరణను నమోదు చేశారు. 

పెళ్లి కోసం ఒత్తిడి చేయడంతో .. ప్రియురాలిని హత్య చేసి.. ముక్కలుగా నరికి.. ఆపై..

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. 20 ఏళ్ల యువతిని దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని బియ్యం బస్తాలో కుక్కారు. ఆ బస్తాను నదిలో పడేశారు. అయితే,  ఆమె మృతదేహం నది ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. దీంతో ఘటన వెలుగు చూసింది. ఇది పరువు హత్యగా అనుమానిస్తున్నారు. యువతి ఒక యువకుడితో ప్రేమలో ఉందని ఆ వ్యవహారం నచ్చకే కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  మృతురాలైన యువతి మేనమామ, తండ్రి, సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని  విచారిస్తున్నారు. 

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ లోని ఖుషి నగర్ జిల్లాలోని బూఢీ గంఢక్ నదిని ఆనుకుని నర్వాజ్యోత్ డ్యామ్ ను నిర్మించారు. కాగా.. ఈ డ్యాముకు దగ్గరలో ఓ యువతి మృతదేహం దొరికింది. ఇది స్థానికంగా కలకలం రేపింది. వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల దర్యాప్తులో ఆ యువతి గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం తెలిసింది. 

దీంతో పరువు హత్యగా అనుమానించి ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.యువతి తండ్రి, సోదరుడు, మేనమామలతో పాటు.. చనిపోయిన యువతి కుటుంబంలోని మహిళలను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని..  తీవ్రతను బట్టి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఉత్తరప్రదేశ్లోని ఖుషి నగర్ జిల్లా ఎస్పీ రితేష్ కుమార్ సింగ్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం