Har Ghar Tiranga : బైక్ ర్యాలీని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి.. హాజరైన కేంద్రమంత్రులు, ఎంపీలు..

Published : Aug 03, 2022, 02:09 PM IST
Har Ghar Tiranga : బైక్ ర్యాలీని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి.. హాజరైన కేంద్రమంత్రులు, ఎంపీలు..

సారాంశం

75 యేళ్ల భారత స్వాతంత్రోత్సవాలను పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర ప్రారంభించారు. 

ఢిల్లీ : అఖండ భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి ఈ ఆగస్టు 15తో 75 ఏళ్లు పూర్తి కానున్నాయి. భారత స్వతంత్ర సంగ్రామం, ఉద్యమ వీరుల స్ఫూర్తిని ఘనంగా చాటేలా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ప్రత్యేక  కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇక మువ్వన్నెల జెండా గొప్పతనం అందరికీ తెలిసేలా ఇంటింటా మువ్వన్నెల జెండా అంటూ ‘హర్ ఘర్ తిరంగా’ క్యాంపెయిన్ చేపడుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో har ghar tiranga బైక్ ర్యాలీlr ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఎర్రకోట ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ లో కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్, ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్ తో సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధాని మోడీ సోదరుడి నిరసన

ర్యాలీకి ముందు కేంద్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలను ఉద్దేశించి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. మువ్వన్నెల జెండా  స్ఫూర్తిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో అందరూ విస్తృతంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా భారతీయులంతా ఒక్కటే అనే భావనను ముందుకు తీసుకువెళ్లాలి అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ ను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి పైనా ఉందన్నారు. కాగా, ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. 


 

 

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్