
Monkeypox Guidelines: కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ప్రపంచ దేశాలు ఇంకా పూర్తిగా కోలుకోనేలేదు. తాజాగా మరో కొత్త వైరస్ ప్రపంచ మానవాళిని భయాందోళనలోకి నెట్టి వేస్తుంది. అదే.. అత్యంత ప్రమాదకమైన వైరస్ మంకీపాక్స్. కోతుల నుంచి వ్యాప్తి చెందిన ఈ మంకీపాక్స్ వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రపంచ మానవాళికి మరోసారి వైరస్ పియర్ పట్టుకుంది. ఈ వైరస్ భారత్ లోనూ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు భారత్ లో Monkeypox కేసుల సంఖ్య 8కి పెరిగింది. అదే సమయంలో ఈ వ్యాధి బారిన పడి ఓ రోగి కూడా మరణించాడు. దీంతో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది.
Monkeypox వ్యాధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ వ్యాధిని పర్యవేక్షించడానికి, సంక్రమణను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్‌తో పాటు పలువురు వైద్యనిపుణులు సభ్యులుగా ఉన్నారు. మంకీపాక్స్‌కు ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం పలు ఆసుపత్రులను ఆదేశాలు జారీ చేసింది.
Monkeypox ప్రభావం పెరుగుతున్న దృష్ట్యా, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHfW) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు ఏం చేయాలో, ఏం చేయకూడదో అంటూ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.
>> ఏం చేయాలి dos
> వ్యాధి సోకిన రోగులకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి
> వ్యాధి సోకిన వ్యక్తి వద్దకు వెళ్లినప్పుడూ ముసుగు, గ్లౌవ్స్ లు ధరించాలి.
> చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో కడుక్కోవాలి.
> పర్యావరణ పరిశుభ్రత కోసం క్రిమిసంహారకాలను ఉపయోగించండి.
>> ఏమి చేయకూడదు ( Don'ts )
> మంకీపాక్స్ సోకిన రోగి యొక్క బెడ్ లేదా తువ్వాలను పంచుకోవద్దు.
> మంకీపాక్స్ సోకిన రోగితో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు.
> మంకీపాక్స్ వ్యాధి లక్షణాలను కనిపిస్తే.. బహిరంగ కార్యక్రమాలకు హాజరుకావద్దు.
> తప్పుడు సమాచారం ఆధారంగా వ్యక్తుల సమూహాలను కళంకం చేయవద్దు.
> వ్యాధి సోకిన వ్యక్తి దుస్తులతో మీ బట్టలు ఉతకకండి
> మంకీపాక్స్ రోగితో ఆహారాన్ని పంచుకోవద్దు
మంకీపాక్స్ అంటే ఏమిటి?
ఐక్యరాజ్యసమితి ప్రకారం.. Monkeypox వైరస్ ను 1958లో గుర్తించారు. 1970లో కాంగోలో తొమ్మిది నెలల బాలికలో ఈ వ్యాధి మొదటి కేసు కనుగొనబడింది. మంకీపాక్స్ చాలా కేసులు మధ్య, పశ్చిమ ఆఫ్రికా అడవులలో వెలుగులోకి వచ్చాయి. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి ఈ వ్యాధి లక్షణాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచంలోని 75 దేశాలలో మొత్తం 22 వేల కేసులు నమోదయ్యాయి.
బారత్ లో విదేశీ ప్రయాణ చరిత్ర లేని ఆఫ్రికన్ మూలానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీలో పరీక్షించగా.. మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్థారించబడింది. ఇది దేశంలో ఎనిమిదవ కేసు.. కాగా దేశ రాజధాని నగరంలో మూడవ కేసు అని అధికారిక వర్గాలు తెలిపాయి. సదరు వ్యక్తిని సోమవారం ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో చేర్చామని, అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.