26 రోజుల్లో రన్‌వే నిర్మించి లడాఖ్‌ను కాపాడిన ఇంజినీర్.. సోనమ్ నోర్బు విజయగాధ

By Anchit GuptaFirst Published Aug 3, 2022, 1:04 PM IST
Highlights

భారత స్వాతంత్ర్య అనంతరం లడాఖ్‌ను పాకిస్తాన్ చెర నుంచి కాపాడుకోవడంలో సోనమ్ నోర్బు ప్రధాన పాత్ర పోషించారు. లేహ్‌లో 26 రోజుల్లోనే రన్ వే నిర్మించి లడాఖ్‌ను కాపాడటానికి దోహదపడ్డారు. ఇదే రన్ వే మొన్న మన దేశానికి, చైనాకు మధ్య ఘర్షణలు ఏర్పడ్డప్పుడూ ఎంతో ఉపకరించింది.
 

న్యూఢిల్లీ: ఇది లేహ్‌లో నిర్మించిన ఎయిర్‌స్ట్రిప్, సోనమ్ నోర్బుల కథ. లడాఖ్‌ను కాపాడిన ఇంజినీర్ సోనమ్ నోర్బు సాహసోపేత గాధ. 1948లో కేవలం 26 రోజుల్లోనే సోనమ్ నోర్బు లేహ్‌లో రన్ వే నిర్మించారు. తద్వార అప్పుడు లడాఖ్‌ను పాకిస్తాన్ చెర చేరకుండా కాపాడగలిగారు. అలాగే, 2020లోనూ ఇండియా చైనా మధ్య ఘర్షణాయుత వాతావరణం ఏర్పడినప్పుడు ఈ ఎయిర్‌ఫీల్డ్ ఎంతో ఉపకరించింది.

అది 1947 డిసెంబర్.. పాకిస్తాన్ మద్దతు గల గిరిజనులు ష్యోక్, ఇండస్ వ్యాలీలో ముందు పొజిషనన్‌లోకి వస్తున్నారు. ముందు లేహ్‌ను ఆక్రమించుకోవాలని, ఆ తర్వాత మొత్తం లడాఖ్‌ను స్వాధీనం చేసుకోవాలనేది వారి లక్ష్యం. అప్పుడు భారత దేశానికి చెందిన 33 మంది జవాన్లు మాత్రమే లేహ్‌లో ఉన్నారు.

33 మంది జవాన్లు ఉన్నారు. కానీ, వారిని మరింత బలోపేతం చేయడానికి వీలు లేకపోయింది. మరే దారి లేక శ్రీనగర్ నుంచి రెండు డోగ్రా కంపెనీలు వారిని చేరడానికి కాలి నడకే బయల్దేరాయి. 1948 ఫిబ్రవరి 16న వారు జోజిలా దాటుకుని అక్కడకి శీతాకాలంలో తొలిసారిగా ఆ మార్గంలో ప్రయాణాన్ని ప్రారంభించాయి. అందులో లడాఖ్‌ తొలి ఇంజినీర్ సోనమ్ నొర్బూ ఉన్నారు. 

ఇంజినీర్ సోనమ్ నోర్బూ రూ. 13 వేలు వెంటపెట్టుకుని లేహ్‌లో భారత వైమానిక దళానికి చెందిన విమానాలు అక్కడ దిగడానికి రన్ వే నిర్మించాలనే గొప్ప లక్ష్యంతో వెళ్తున్నారు. వారంతా 1948 మార్చి 8వ తేదీన లేహ్ చేరుకున్నారు. ఇండస్ రివర్ బెడ్  నుంచి టౌన్ మధ్య ఎయిర్‌స్ట్రిప్ నిర్మించడానికి మార్చి 12వ తేదీన పనులు ప్రారంభం అయ్యాయి. 2300 యార్డుల పొడవైన రన్ వే ఏప్రిల్ 6వ తేదీ కల్లా సిద్ధం అయిపోయింది.

ఇందుకోసం నోర్బు రూ. 10,891 ఖర్చు పెట్టారు. మిగిలిన 2109 అమౌంట్‌ను తిరిగి ఖజానాలో జమ చేశారు. ఈ ఎయిర్‌ఫీల్డ్ నిర్మాణం పూర్తికాగానే తాను ఎయిర్‌క్రాఫ్ట్‌ను బయల్దేరి రమ్మని ఏప్రిల్ 6న వైర్ లెస్ సందేశం పంపారు. 

ఎయిర్ కమాండర్ మెహర్ సింగ్ పిస్టన్ ఇంజిన్డ్ డకోటా విమానాన్ని లేహ్ రన్ వే పై విజయవంతంగా ల్యాండ్ చేసి చరిత్రలో కీలక మలుపు శ్రీకారం చుట్టారు. ఈ ఫీట్‌తో లడాఖ్‌ను మనం కాపాడుకోగలిగాం. నోర్బు ఆ తర్వాత జమ్ము కశ్మీర్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో చేరారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌లో చీఫ్ ఇంజినీర్‌గా సేవలు అందించారు. శ్రీనగర్, లేహ్ రోడ్ల నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

 

-- (అంచిత్ గుప్తా మిలిటరీ కుటుంబంలో జన్మించారు. ఫైనాన్స్ ప్రొఫెషనల్. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఈక్విటీ సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్‌గా చేస్తున్నారు. భారత వైమానిక చరిత్రలో ఆయనకు ఆసక్తి ఎక్కువ. అందుకే భారత వాయు సేన చరిత్రను పలు వేదికలపై పంచుకుంటుంటారు.)

click me!