కథువా అత్యాచార ఘటనలో మరికొద్దిసేపట్లో కీలక తీర్పు

By Siva KodatiFirst Published Jun 10, 2019, 10:27 AM IST
Highlights

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా అత్యాచారం కేసులో సోమవారం కీలక తీర్పు వెలువడనుంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులో విచారణ ముగిసిన నేపథ్యంలో న్యాయమూర్తులు ఇవాళ తీర్పును వెలువరించనున్నారు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా అత్యాచారం కేసులో సోమవారం కీలక తీర్పు వెలువడనుంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులో విచారణ ముగిసిన నేపథ్యంలో న్యాయమూర్తులు ఇవాళ తీర్పును వెలువరించనున్నారు.

దీంతో ముందు జాగ్రత్తగా పంజాబ్, హర్యానాల్లో‌ భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. జమ్మూకశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, హతమార్చిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

చిన్నారిపట్ల అత్యంత పాశవికంగా జరిగిన ఈ దాడిపై నిరసనలు వ్యక్తమవ్వడం.. దీనికి తోడు కశ్మీర్‌లో ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సుప్రీంకోర్టు ఈ కేసును పఠాన్‌కోట్ కోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసులో ఎనిమిది నిందితులు ఉండగా... వారిలో ఏడుగురిపై ఛార్జ్‌షీట్ దాఖలైంది. 

click me!