మీ నాయకురాలు సోనియానా.. వసుంధరా రాజేనా, త్వరలోనే నిర్ణయం చెబుతా : అశోక్ గెహ్లాట్‌పై సచిన్ సెటైర్లు

Siva Kodati |  
Published : May 09, 2023, 03:43 PM ISTUpdated : May 09, 2023, 03:45 PM IST
మీ నాయకురాలు సోనియానా.. వసుంధరా రాజేనా, త్వరలోనే నిర్ణయం చెబుతా : అశోక్ గెహ్లాట్‌పై సచిన్ సెటైర్లు

సారాంశం

బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం వసుంధరా రాజేను ప్రశంసిస్తూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్. ఆయనకు సోనియా గాంధీ నాయకురాలు కాదేమో, రాజే నాయకత్వంలో సీఎం పనిచేస్తున్నారేమోనంటూ సచిన్ సెటైర్లు వేశారు.

రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం వసుంధరా రాజేను ప్రశంసిస్తూ సీఎం అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ రెచ్చిపోయారు. వసుంధర రాజేను గెహ్లాట్ ప్రశంసించడంపై సచిన్ అభ్యంతరం తెలిపారు. పార్టీ పార్టీ సీఎం అయి వుండి.. నిత్యం సొంత పార్టీ నేతలపై విమర్శలు చేసే బీజేపీ నేతలను ఎలా ప్రశంసిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటిది తాను తొలిసారి చూస్తున్నానని.. ఇది మంచి పద్ధతి కాదని సచిన్ పేర్కొన్నారు. 

బహుశా అశోక్ తీరు చూస్తుంటే.. ఆయనకు సోనియా గాంధీ నాయకురాలు కాదేమో, రాజే నాయకత్వంలో సీఎం పనిచేస్తున్నారేమోనంటూ సచిన్ సెటైర్లు వేశారు. వసుంధర రాజే ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతిపై చర్యలు తీసుకోవాలని తాను ఎన్నిసార్లు కోరుతున్నా ఇప్పటికీ ఎందుకు పట్టించుకోవడం లేదో ఇప్పుడు అర్ధమైందన్నారు. రాష్ట్రంలో అవినీతికి వ్యతిరేకంగా ఈ నెల 11న తాను అజ్మీర్‌లో జన సంఘర్ష్ యాత్రను మొదలుపెడుతున్నట్లు సచిన్ పైలట్ తెలిపారు. ఐదు రోజుల పాటు సాగే ఈ యాత్ర జైపూర్‌లో ముగుస్తుందని.. దీని తర్వాతే తన రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో తాను కాంగ్రెస్ పార్టీని వీడబోయేది లేదని సచిన్ పైలట్ వెల్లడించారు. అలాగే తాను సీఎం అశోక్ గెహ్లాట్‌కు వ్యతిరేకం కాదని.. అవినీతికి మాత్రమే వ్యతిరేకమని సచిన్ పైలట్ స్పష్టం చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్