
భువనేశ్వర్:ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లాలో మంగళవారంనాడు జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కలహండి జిల్లాలోని ఎం. రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాపరెంగా-లుడెన్ గా అటవీ ప్రాంతంలో ఇవాళ మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇవాళ తెల్లవారుజామున కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాలు కాల్పులకు దిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఎన్ కౌంటర్ లో డీఎస్పీకి గాయాలయ్యాయి.డీఎస్పీని బోలరింగ్ లోని భీమాబోయ్ ఆసుపత్రిలో చేర్పించారు.
ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలున్నాయనే సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ఇవాళ పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఎన్ కౌంటర్ జరిగింది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ 26న మావోయిస్టులు పేల్చిన మందుపాతరలో 11 మంది జవాన్లు మృతి చెందారు.