రాహుల్ గాంధీ ఫ్లైట్‌ ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరణ ఆరోపణలను ఖండించిన వారణాసి ఎయిర్‌పోర్టు

Published : Feb 14, 2023, 01:43 PM ISTUpdated : Feb 14, 2023, 01:53 PM IST
రాహుల్ గాంధీ ఫ్లైట్‌ ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరణ ఆరోపణలను ఖండించిన వారణాసి ఎయిర్‌పోర్టు

సారాంశం

వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయంలో రాహుల్ గాంధీ విమానానికి ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను వారణాసి ఎయిర్‌పోర్టు ఖండించింది. 

వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయంలో రాహుల్ గాంధీ విమానానికి ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను వారణాసి ఎయిర్‌పోర్టు ఖండించింది. రాహుల్ గాంధీ స్వయంగా వారణాసికి వెళ్లడాన్ని రద్దు చేసుకున్నారని.. ఆయన చార్టర్డ్ ఎయిర్‌లైన్ గత రాత్రి వారణాసి విమానాశ్రయానికి రద్దు విషయాన్ని తెలియజేసిందని పేర్కొంది. ట్విట్టర్‌లో ఓ పోస్టుకు రిప్లై ఇచ్చిన వారణాసి ఎయిర్‌పోర్టు అధికారులు.. తమపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. 

‘‘ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా వారణాసి విమానాశ్రయానికి ఫిబ్రవరి 13న 21:16 గంటలకు ఈమెయిల్ పంపడం ద్వారా ఏఆర్ ఎయిర్‌వేస్ విమానాన్ని రద్దు చేసింది.  ఆపరేటర్ ద్వారా విమానాన్ని రద్దు చేసినందున దయచేసి మీ ప్రకటనను సరి చేయండి’’ అని వారణాసి ఎయిర్‌పోర్టు అధికారులు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే.. ఎయిర్‌పోర్టు అధికారులు ఒత్తిడి చేయడం వల్లే రాహుల్ గాంధీ విమానం ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వలేదని..రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనను ‘సాకు’గా ఉపయోగించుకున్నారని కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ అన్నారు. ‘‘రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాలని నిర్ణయించారు, అయితే ప్రభుత్వ ఒత్తిడి కారణంగా విమానాశ్రయ అధికారులు అతని విమానాన్ని ల్యాండ్ చేయడానికి అనుమతించలేదు. భారీ విమానాల కదలిక, ట్రాఫిక్ రద్దీ ఉందని వారు చెప్పారు. అనుమతి ఇవ్వలేదు’’ అని అజయ్ రాయ్ ఆరోపించారు.


 

రాహుల్ గాంధీని చూసి బీజేపీ ప్రభుత్వం భయపడుతోందని.. అందుకే వారణాసిలోని విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేయడానికి అనుమతించలేదని అని అజయ్ రాయ్ ఆరోపించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహించినప్పటి నుంచి దేశ ప్రధాని ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇప్పుడు రాహుల్‌ను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం