మకర సంక్రాంతి సందర్భంగా... ఘనంగా ‘ప్రేమికుల జాతర’... ఎక్కడంటే...

By SumaBala BukkaFirst Published Jan 18, 2022, 11:31 AM IST
Highlights

600యేళ్ల క్రితం మహోబా జిల్లా సుగిరా ప్రాంతానికి చెందిన నోనే అర్జున్ సింగ్ అనే రాజు.. భురాగఢ్ ప్రాంతాన్ని పాలించేవారు. మధ్యప్రదేశ్ లోని సారాబాయి ప్రాంతంలోని నట్ సమాజానికి చెందిన బీరన్ అనే 21 యేళ్ల యువకుడు ఆ కోటలో సేవకుడిగా ఉండేవాడు. మంత్రతంత్రాలో పాటు అన్ని రంగాల్లో అపార నైపుణ్యం అతని సొంతం ఈ క్రమంలోనే 
బీరన్ ను రాజు కూతురు లవ్ చేసింది.

ఉత్తర్ ప్రదేశ్ : మకర సంక్రాంతి సందర్భంగా Uttar Pradeshలోని బాందా నగరంలో నిర్వహించిన ‘ప్రేమికుల జాతర’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండ్రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి వందలాది మంది తరలివచ్చారు. ఈ ప్రాంతంలో నిర్మించిన నట్ బాలీ బాబా ఆలయంలో ప్రేమికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కోరికను బాబాతో చెప్పుకుంటే.. నెరవేరుతుందనేది వారి నమ్మకం. 

ఇదీ కథ : 600యేళ్ల క్రితం మహోబా జిల్లా సుగిరా ప్రాంతానికి చెందిన నోనే అర్జున్ సింగ్ అనే రాజు.. భురాగఢ్ ప్రాంతాన్ని పాలించేవారు. మధ్యప్రదేశ్ లోని సారాబాయి ప్రాంతంలోని నట్ సమాజానికి చెందిన బీరన్ అనే 21 యేళ్ల యువకుడు ఆ Fortressలో సేవకుడిగా ఉండేవాడు. మంత్రతంత్రాలో పాటు అన్ని రంగాల్లో అపార నైపుణ్యం అతని సొంతం ఈ క్రమంలోనే Beeranను రాజు కూతురు love చేసింది. బీరన్ ను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని తండ్రికి తెలపగా... రాజు ఓ షరతు విధించారు.

Kane Riverకి అవతలివైపు ఉన్న బాంబేశ్వర్ పర్వతం మీద కోటనుంచి భురాగఢ్ కోట వరకు నది మీద తాడు సాయంతో బీరన్ రాగలిగితే.. అతనికి ఇచ్చి వివాహం చేస్తానని చెప్పారు. ఈ షరతును అంగీకరించిన బీరన్.. రెండు కోటల మధ్య నది మీద తాడు ద్వారా వచ్చే ప్రయత్నం చేశాడు.

ఇంతలో king.. తాడున తెగ్గొట్టడంతో బీరన్ కోట ప్రాకారాలపై పడి మరణిస్తాడు. ఇది తెలుసుకున్న రాజు కుమార్తె. కోట మీదినుంచి దూకి suicide చేసుకుంటుంది. వీరి ప్రేమకు చిహ్నంగా ఆ ప్రాంతంలో వారి సమాధులను నిర్మించి వాటి మీద గుడి కట్టారు. నాటి నుంచి సంక్రాతి రోజున ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా,  సంక్రాంతి పండుగ ఆంధ్రప్రదేశ్ లోని ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఈ విషాదకర ఘటన Chittoorలో జరిగింది. పశువుల పండుగలో విషాదం చోటు చేసుకుంది. ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో పొట్టేలును Sacrifice చేస్తుండగా.. దాన్ని పట్టుకున్న వ్యక్తి మృతి చెందాడు. బలి ఇచ్చే వ్యక్తి.. liquor మత్తులో పొట్టేలుకు బదులు వ్యక్తి ప్రాణాన్ని తీశాడు. భయాందోళనలు కలిగించేలా ఉన్న ఈ ఘటనలో అక్కడ ఒక్కసారిగా కలకలం చెలరేగింది. 

ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలంలోని వలసపల్లెలో జరిగింది. తరతరాలుగా సంప్రదాయబద్ధంగా వస్తున్న పండుగ ఆచారం ప్రకారం స్థానిక ఎల్లమ్మ ఆలయం వద్ద పొట్టేలును బలివ్వడానికి గ్రామస్తులు సిద్ధమయ్యారు. అయితే పొట్టేలును నరికే వ్యక్తి కాస్త ఎక్కువగానే తాగి ఉన్నాడు. అది వీరు గమనించుకోలేదో.. లేక కామనే అనుకున్నారో కానీ ఓ వ్యక్తి ప్రాణం గాల్లో కలిసిపోయింది. 

బలి ఇచ్చే క్రమంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి పొట్టేలును నరకబోయి.. పొట్టేలును పట్టుకున్న సురేష్ (35) అనే వ్యక్తిని నరికాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది చూసి గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఒక్కక్షణం షాక్ అయ్యారు. ఆ తరువాత ఏడుపులు మిన్నంటాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

click me!