Maharashtra Congress: మోడీని చంపగలను..! చిక్కుల్లో మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్

By Rajesh KFirst Published Jan 18, 2022, 11:14 AM IST
Highlights

Maharashtra Congress: మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే చిక్కుల్లో ప‌డ్డాడు. తాను మోదీని చంపగలనని, అత‌డిని దూషించ‌గ‌ల‌న‌నే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆ వ్యాఖ్య‌లే త‌న‌ని చిక్కుల్లో ప‌డేశాయి. తాను ప్ర‌ధానిపై ఆ వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని, తాను.. మోడీ అనే లోక‌ల్ గుండాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాన‌ని స‌మ‌ర్ధించుకున్నారు. 
 

Maharashtra Congress: మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే చిక్కుల్లో ప‌డ్డాడు. తాను ప్ర‌ధాని మోడీని చంప‌గ‌ల‌న‌ని, ప్ర‌ధాని దూషించ‌గ‌ల‌న‌ని నానా పటోలే చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడూ వివాదాస్పదంగా మారాయి. సోమవారం (జనవరి 17, 2022)న కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే  భండారా జిల్లాలోని లఖానీ తహసీల్ జిల్లాపరిషత్, పంచాయతీ సమితి ఎన్నికలకు ముందు జరిపిన ప్రచార సమావేశంలో మాట్లాడుతూ.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. తాను గ‌త 30 యేండ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నాన‌నీ, ఒక్క స్కూల్ కూడా త‌న‌ పేరు మీద లేదనీ చెప్పుకోచ్చాడు. తాను అంద‌రికీ సహ‌యం చేస్తాన‌నీ స్థానికులకు చెప్పుకోచ్చారు.  
ఈ క్ర‌మంలో త‌ను మోదీని చంపగలననీ, అత‌డిని దూషించగలననీ అన్నారు.  మోడీ త‌న‌కు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారని నానాపటోలే అన్నారు. ఆయ‌న వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు నెట్టింట్లో వైర‌ల్ గా మారాయి. ఈ వ్యాఖ్య‌ల‌పై రాజకీయ దూమారం రేగుతోంది. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లెత్తున్నాయి. ఈ క్ర‌మంలో  
నానాపటోలే చేసిన వ్యాఖ్య‌ల‌ను మహారాష్ట్ర ప్రతిపక్ష నేత, బీజేపీ నాయ‌కుడు దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా  ఖండించారు. త‌న‌దైన శైలిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

‘‘ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోదీ కాన్వాయ్ ను 20 నిమిషాల పాటు నిలిపివేశారు, ఇప్పుడేమో మోదీని చంపగలనని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత నానాపటోలే వ్యాఖ్యానించారు’’ అని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని ప్రతి జిల్లా కాంగ్రెస్ కమిటీలో ఒక మహిళను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాలని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది.

రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే మాట్లాడుతూ, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయించడంతోపాటు ఇతర కీలక పరిణామాలు కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని నానా పటోలే చెప్పారు.

త‌న వ్యాఖ్య‌లు వైర‌ల్ కావ‌డంతో కాంగ్రెస్  నానా పటోలే స్పందించారు. తాను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని ఉద్దేశించి. మాట్లాడలేదని, స్థానిక గ్రామ గూండా అని స్పష్టం చేశారు.తన నియోజకవర్గంలో మోడీ అనే స్థానిక గూండాపై  స్థానికులు తనకు ఫిర్యాదు చేశారని, గ్రామస్థులతోఆ విష‌మంలో మాట్లాడుతున్న‌ప్పుడు.. తీసిన వీడియో అని, త‌నపై కావాలనే ఇలాంటి ప్ర‌చారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. 

click me!