డెంగ్యూ వ్యాక్సిన్‌ సిద్ధం చేసిన హైదరాబాద్ కంపెనీ: 2026 నాటికి మార్కెట్లోకి

By narsimha lode  |  First Published Mar 19, 2024, 11:56 AM IST

డెంగ్యూ వ్యాక్సిన్ పై పరిశోధనలు సాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన తొలి దశ క్లినికల్ ట్రయల్స్  విజయవంతమయ్యాయి.


న్యూఢిల్లీ: డెంగ్యూ వ్యాక్సిన్ 2026 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.  టీకా భద్రతను గుర్తించేందుకు  ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ తొలి దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసిందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కె.ఆనంద్ కుమార్ తెలిపారు.ఈ వ్యాక్సిన్ సామర్ధ్యాన్ని పరీక్షించేందుకు  రెండవ, మూడో దశల ట్రయల్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి.1982లో  ఐఐఎల్ ను స్థాపించారు.  నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు యాజమాన్యంలోని అనుబంధ సంస్థే ఐఐఎల్.ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్  కంపెనీ ప్రధాన కార్యాలయం హైద్రాబాద్‌లో ఉంది.

also read:హైజాకైన నౌకను రక్షించిన భారత్: మోడీకి బల్గేరియా అధ్యక్షుడు రుమెన్ ధన్యవాదాలు

Latest Videos

తొలి దశ ట్రయల్ ను పూర్తి చేసినట్టుగా  చెప్పారు. తొలి దశ ట్రయల్ విజయవంతమైందని తెలిపారు. తొలి దశ ట్రయల్ పరీక్షలో ఎలాంటి ప్రతికూల నివేదికలు రాలేదని  డాక్టర్ ఆనంద్ కుమార్ ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక హిందూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తొలి దశ ఫలితాలు ఇప్పటికే పీర్-రివ్యూడ్ జర్నల్స్ లో ప్రచురించిన విషయాన్ని డాక్టర్ కుమార్ గుర్తు చేశారు. 2026 ప్రారంభంలో డెంగ్యూ వ్యాక్సిన్ ను విడుదల చేయాలని భావించినప్పటికీ  కొన్ని కారణాలతో  ఈ వ్యాక్సిన్  2026 మధ్య నాటికి మార్కెట్ లో సిద్దంగా ఉండే అవకాశం ఉందని ఆయన  తెలిపారు.

also read:తమిళిసై రాజీనామా ఆమోదం: తెలంగాణకు కొత్త గవర్నర్‌గా సీ.పీ.రాధాకృష్ణన్ నియామకం

జికా వైరస్, క్యాసనూర్ ఫారెస్ట్ డీసీజ్ కోసం ఈ కంపెనీ వ్యాక్సిన్ ను అభివృద్ది చేస్తుంది. కర్ణాటక రాష్ట్రంలోని అడవుల్లో  1957లో  ఈ వైరస్ ను గుర్తించారు. ఈ వైరస్ కారణంగా ప్రతి ఏటా  400 నుండి 500 మందికి సోకుతుంది. ఈ వైరస్ సోకిన జంతువు లేదా చనిపోయిన కోతి కారణంగా ఈ వ్యాధి  మానవులకు సంక్రమిస్తుంది.  ఈ వ్యాధి కర్ణాటక సహా సరిహద్దు ప్రాంతాలకే పరిమితమైంది.

also read:తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్: నాలుగు రోజులపాటు వర్షాలు

జికా వ్యాక్సిన్ కోసం  నిర్వహించే క్లినికల్ ట్రయల్స్ కోసం నిర్వహించే అన్ని ఖర్చులను భరించేందుకు  ఐసీఎంఆర్ సూత్రప్రాయంగా అంగీకరించింది. కౌన్సిల్‌తో పాటు కెఎఫ్‌డి కోసం వ్యాక్సిన్ ను అభివృద్ది చేసే విషయమై పరిశోధనలు చేస్తున్నట్టుగా డాక్టర్ కుమార్ తెలిపారు.

also read:గెలుపు గుర్రాల కోసం అన్వేషణ: 13 స్థానాల్లో అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు

ఈ ఏడాది జనవరి మాసంలో ఇదే కంపెనీ హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ హవిషూర్ ను విడుదల చేసింది. ఈ వ్యాక్సిన్ కు మంచి స్పందన వచ్చిందని డాక్టర్ కుమార్ తెలిపారు.డెంగ్యూకు వ్యాక్సిన్ ను 2026 మధ్యలో  వాణిజ్యపరంగా అందుబాటులోకి రావచ్చని ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్  ఎండీ కె.ఆనంద్ కుమార్ తెలిపారు.ఈ వ్యాక్సిన్  తొలి దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయన్నారు. రెండో, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ను త్వరలో ప్రారంభిస్తామన్నారు.

click me!