ఉత్తరాఖండ్‌లో విలయం: 40 మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

By narsimha lodeFirst Published Feb 14, 2021, 10:55 AM IST
Highlights

వారం రోజుల క్రితం మంచు చరియలు విరిగిపడిన ఘటనలో తపోవన్ విద్యుత్ ప్రాజెక్టులో చిక్కుకొన్న వారిలో ఆదివారం నాటికి 40 మృతదేహాలను స్వాధీనం చేసుకొన్నారు.

డెహ్రాడూన్: వారం రోజుల క్రితం మంచు చరియలు విరిగిపడిన ఘటనలో తపోవన్ విద్యుత్ ప్రాజెక్టులో చిక్కుకొన్న వారిలో ఆదివారం నాటికి 40 మృతదేహాలను స్వాధీనం చేసుకొన్నారు.శనివారం నాటికి 38 మృతదేహాలను స్వాధీనం చేసుకొన్నారు. ఆదివారం నాడు మరో రెండు డెడ్‌బాడీలు లభ్యమయ్యాయి.ఇంకా 166 మంది ఆచూకీ  దొరకడం లేదు.

also read:ఉత్తరాఖండ్‌ టన్నెల్‌ వద్ద సహాయక చర్యలు: 3 రోజులుగా వేచి చూస్తున్న కుక్క

ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలోని జోషిమత్‌లోని తపోవన్ సొరంగం వద్ద సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బందికి రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి.ఇప్పటివరకు 40 మృతదేహాలను స్వాధీనం చేసుకొన్నామని ఉత్తరాఖండ్ డీజీపీ ఆశోక్ కుమార్ చెప్పారు. ఇంకా 164 మంది ఆచూకీ కోసం గాలింపు చేపట్టామన్నారు. 

మృతదేహాల్లో ఇప్పటికే 16 మందిని గుర్తించామని ఆయన తెలిపారు. అంతేకాదు వరద ప్రభావిత ప్రాంతాల్లో 18 శరీర భాగాలను స్వాధీనం చేసుకొన్నారు. వీటిలో 10 డెడ్ బాడీల నుండి డీఎన్ఏ నమూనాలు తీసుకొన్నారు. ఆ తర్వాత ఆ డెడ్ బాడీలకు దహన సంస్కారాలు నిర్వహించారు.
 

click me!