రాజస్థానీ స్టైల్లో నెత్తిన తలపాగా.. ట్రాక్టర్ నడుపుకుంటూ సభకు రాహుల్

By Siva KodatiFirst Published Feb 13, 2021, 9:34 PM IST
Highlights

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ఈ మధ్య రాజకీయాల్లో విభిన్నంగా ప్రవర్తిస్తున్నారు. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుల్ని కలిసి సంచలనం రేకెత్తించా

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ఈ మధ్య రాజకీయాల్లో విభిన్నంగా ప్రవర్తిస్తున్నారు. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుల్ని కలిసి సంచలనం రేకెత్తించారు.

తాజాగా నేడు రాజస్థాన్‌లో రైతుల దీక్షకు మద్ధతు తెలుపుతూ సభా స్థలికి ట్రాక్టర్‌పై వచ్చారు. అజ్మీర్‌లోని రూపన్‌గఢ్‌లో అన్నదాతలు శనివారం మహా పంచాయతీ నిర్వహించారు. 

రాజస్థానీ సంప్రదాయంలో తలపాగా ధరించిన రాహుల్‌ గాంధీ.. ట్రాక్టర్‌ నడుపుతూ సభా వేదిక వద్దకు వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ ట్రాక్టర్‌పై చెరోవైపు కూర్చున్నారు.

అనంతరం రెండు ట్రాక్టర్‌ ట్రాలీలతో ఏర్పాటు చేసిన వేదికపై నిల్చుని రాహుల్‌ సాగు చట్టాలపై ప్రసంగించారు. రాహుల్‌ ట్రాక్టర్‌ నడుపుతున్న ఫొటోలను కాంగ్రెస్‌ పార్టీ అధికారిక సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.   

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వ్యవసాయమనే వ్యాపారాన్ని ప్రధాని తన స్నేహితులకు అప్పగించాలనుకుంటున్నారని ఆరోపించారు.

దీనిలో భాగంగానే ప్రధాని కొత్త చట్టాలు తీసుకొచ్చారని రాహుల్ దుయ్యబట్టారు. దేశంలోని 40 శాతం మందికి వ్యవసాయంతో సంబంధం ఉందని.. వీరిలో రైతులు, చిన్న, మధ్య తరహా వ్యాపారులు, కూలీలు ఉన్నారని స్పష్టటం చేశారు.

ఇలాంటి వ్యవసాయ వ్యాపారాన్నంతా మోదీ తన స్నేహితులకు ఇవ్వాలని చూస్తున్నారని యువనేత ఆరోపించారు. అసలు సాగు చట్టాల ఉద్దేశం ఇదేనిని రాహుల్‌ ఆరోపించారు. సాగు చట్టాలతో రైతులకు అవకాశాలు ఇచ్చామని ప్రధాని అంటున్నారని, అయితే ఆయన చెబుతున్న అవకాశాలు.. ఆకలి, నిరుద్యోగం, ఆత్మహత్యలేన ఎద్దేవా చేశారు. 

click me!