బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష.. అతడి తల్లి గుర్తింపును రివీల్ చేయడంతోనే..!!

By Sumanth Kanukula  |  First Published Oct 22, 2023, 2:34 PM IST

ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో  ఓ వ్యక్తికి కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి గుర్తింపును అతడి తల్లే రివీల్ చేయడంతో ఇది సాధ్యమైంది.


ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో  ఓ వ్యక్తికి కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి గుర్తింపును అతడి తల్లే రివీల్ చేయడంతో ఇది సాధ్యమైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. 2019 మే నెలలో ఎనిమిదేళ్ల బాలికపై మూల్‌చంద్‌ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి గుర్తుతెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే బాలికకు నిందితుడు ఎవరో తెలియకపోవడంతో.. నిందితుడిని పట్టుకోవడం పోలీసులకు కష్టతరంగా మారింది. 

అయితే నేరం జరిగిన కొన్ని రోజులకు నిందితుడు మూల్‌చంద్ తల్లి బాధిత బాలిక ఇంటికి చేరుకుంది. తన కుమారుడు చేసిన పనికి క్షమాపణ  కోరింది. జరిగిన ఘటన పట్ల తాను చాలా బాధపడుతున్నట్టుగా పేర్కొంది. ఈ విధంగా నిందితుడు మూల్‌చంద్‌ గురించి రివీల్ అయింది. ఈ క్రమంలోనే అతడిని పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత కోర్టు శిక్ష విధించడం జరిగింది. 

Latest Videos

undefined

ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వ  న్యాయవాది రతన్‌లాల్ లోధీ శనివారం మాట్లాడుతూ.. ‘‘బాలిక తన ఇంటి బయట ఆడుకుంటున్నప్పుడు నిందితుడు అతడి బైక్‌పై తీసుకెళ్లాడు. నేరానికి పాల్పడిన తర్వవాత ఆధారాలను కూడా తొలగించే ప్రయత్నం చేశాడు. అనంతరం బాలిక తన ఇంట్లో జరిగిన బాధను వివరించింది. నిందితుడు పక్క గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో బాలిక అతడిని గుర్తించలేకపోయింది. అదే రోజు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు  చేయడంతో కేసు నమోదైంది. బాలికను వైద్య పరీక్షల కోసం జిల్లా ఆసుపత్రికి పంపారు. అక్కడ బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. 

బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిపై ఐపీసీలోని సంబంధిత సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది.  నేరం చేసిన వ్యక్తికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అతడిని పట్టుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. అయితే నిందితుడి తల్లి బాలిక ఇంటికి చేరుకుని తన కుమారుడి పేరును బయటపెట్టడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2019 అక్టోబరు నెలలో ఛార్జిషీట్ సమర్పించబడింది. కోర్టు నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 60,000 జరిమానా విధించింది’’ అని చెప్పారు. 

click me!