నూతన వధూవరులకు కరోనా: గ్రామంలో ప్రతి ఒక్కరికి పరీక్షలు

By narsimha lode  |  First Published Apr 26, 2020, 5:35 PM IST

 కొత్తగా పెళ్లి చేసుకొన్న జంటకు కరోనా సోకడంతో ఆ గ్రామాన్ని దిగ్భందించారు అధికారులు, గ్రామం మొత్తం స్క్రీనింగ్ చేసేందుకు గ్రామంలోకి రాకపోకలను నిషేధించారు.
 



వారణాసి: కొత్తగా పెళ్లి చేసుకొన్న జంటకు కరోనా సోకడంతో ఆ గ్రామాన్ని దిగ్భందించారు అధికారులు, గ్రామం మొత్తం స్క్రీనింగ్ చేసేందుకు గ్రామంలోకి రాకపోకలను నిషేధించారు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బర్దా ఏరియాలోని ఆజంఘర్ జిల్లాలోని చత్తార్‌పూర్  గ్రామానికి చెందిన  ముగ్గురిని వైద్య సిబ్బంది క్వారంటైన్ కు తరలించారు. వీరిలో ఇద్దరు కొత్తగా పెళ్లైన వధూవరులు. ఈ జంటకు మార్చి నెల 23వ తేదీన పెళ్లి జరిగింది. 

Latest Videos

రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన యువకుడు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువతిని వివాహం చేసుకొన్నాడు. ఏప్రిల్ 14వ తేదీన కొత్త జంట రాజస్థాన్ కు పయనమయ్యారు.  నాలుగు రోజుల తర్వాత ఈ జంట రాజస్థాన్ కు చేరుకొన్నారు.

also read:పరిమితమైన సడలింపులతో లాక్ డౌన్ కొనసాగింపుకు రాష్ట్రాల మొగ్గు?

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అజంఘర్ నుండి ఈ జంట వచ్చిన విషయం తెలుసుకొన్న అధికారులు సరిహద్దులోనే అధికారులు నిలిపివేశారు.  వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు దీంతో ఈ వధూవరులకు కరోనా సోకిందని గుర్తించారు.

వెంటనే అధికారులు వారిని క్వారంటైన్ కి తరలించారు. నూతన వధూవరులకు కరోనా సోకిన విషయాన్ని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆజంఘర్ జిల్లాలోని చత్తార్ పూర్  అధికారులకు కూడ రాజస్థాన్ అధికారులు చేరవేశారు.దీంతో చత్తార్‌పూర్ గ్రామాన్ని అధికారులు దిగ్భంధించారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ చేయనున్నారు.

click me!