లాక్‌డౌన్‌ను ఎత్తివేయడం సునిత అంశం.. సొంత వైద్యం వద్దు: ఉద్ధవ్ థాక్రే

By Siva Kodati  |  First Published Apr 26, 2020, 5:32 PM IST

రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల ఉద్ధృతిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 80 శాతం లక్షణాలు లేకుండానే పాజిటివ్‌గా తేలుతున్నాయని థాక్రే అన్నారు. 


రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల ఉద్ధృతిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 80 శాతం లక్షణాలు లేకుండానే పాజిటివ్‌గా తేలుతున్నాయని థాక్రే అన్నారు.

మిగతా 20 శాతం బాధితుల్లో కొందరిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తుండగా మరికొందరిలోనే తీవ్రంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో లక్షణాలు కనిపించిన వెంటనే సొంత వైద్యం చేసుకోకుండా వైద్యులను సంప్రదించాలని ఉద్ధవ్ రాష్ట్ర ప్రజలకు సూచించారు.

Latest Videos

Also Read:క్యాంపులో వంటవాడికి పాజిటివ్: 14 మంది బీఎస్ఎఫ్ జవాన్లు క్వారంటైన్‌లోకి

లాక్‌డౌన్‌ను సడలిస్తే ముంబై నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉంటుందని, ఈ సందర్భంలో కరోనాపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో లాక్‌‌డౌన్‌ను ఎత్తివేయడం ఎంతో సున్నితత్వంతో కూడుకున్నదని.. వచ్చే మూడు, నాలుగు నెలలు ఎంతో కీలకమైని వ్యాఖ్యానించారు.

అయితే ఎమర్జెన్సీ సర్వీసుల కిందకు వచ్చే డాక్టర్లు తమ క్లినిక్‌లను నడుపుకోవడంతో పాటు డయాలసిస్ సెంటర్లను కూడా ప్రారంభించవచ్చని థాక్రే సూచించారు. ప్రస్తుతం క్లిష్ట పరిస్ధితుల్లో నగరంలో రైలు సర్వీసులను నడపటం అసాధ్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Also Read:ఢిల్లీలో లాక్‌డౌన్ సడలింపులు.. కేవలం వీటికి మాత్రమే: కేజ్రీవాల్ ప్రకటన

అలాంటి చర్యలు చేపడితే మాత్రం కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని పరిస్థితులపై ఈ నెల చివరినాటికి ఓ నిర్ణయానికి వస్తామని ఉద్థవ్ పేర్కొన్నారు.

కాగా దేశంలోనే కరోనా కేసుల విషయంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,628 పాజిటివ్ కేసులు నమోదుకాగా 323 మంది మృత్యువాతపడ్డారు. ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 800 కేసులు నమోదయ్యాయి. 

click me!