Uttar Pradesh : మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా ఉత్తరప్రదేశ్ : ప్రధాని మోదీ ప్రశంసలు

Published : Sep 25, 2025, 11:23 PM IST
Uttar Pradesh

సారాంశం

Uttar Pradesh : సీఎం యోగి ఆధ్వర్యంలో యూపీ మహిళా సాధికారతకు కేంద్రంగా మారిందని ప్రధాని మోదీ ప్రశంసించారు. స్వయం సహాయక బృందాల మహిళా పారిశ్రామికవేత్తలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు.

Uttar Pradesh : ఒకప్పుడు మహిళలకు సురక్షితం కాదనుకున్న ఉత్తరప్రదేశ్, ఇప్పుడు మహిళా సాధికారతకు ఒక మోడల్‌గా నిలిచింది. 2017కు ముందు మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే సంకోచించేవారు, ఇక వ్యవస్థాపకత గురించి ఆలోచించే పరిస్థితి లేదు. గడిచిన ఎనిమిదిన్నర సంవత్సరాలల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఈ అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.

మహిళలతో ముచ్చటించిన ప్రధాని మోదీ

గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో జరిగిన యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2025లో ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయం సహాయక బృందాల మహిళా పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు. చాలా మందికి ప్రధానితో తమ కథలను పంచుకోవడం ఒక కల నిజమైనట్లు అనిపించింది. వారి ప్రయాణాలు వ్యక్తిగత విజయాలనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విప్లవాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. మహిళలు ఇప్పుడు సురక్షితంగా ఉన్నామని, తమ ఆశయాలను సాధించడానికి సాధికారత పొందామని ఇది చూపిస్తుంది.

 మహిళల సక్సెస్ స్టోరీలు

మీరట్‌కు చెందిన విద్యుత్ సఖి సంగీత… తాను ఇప్పుడు విద్యుత్ బిల్లులు వసూలు చేస్తూ స్థిరమైన ఆదాయం సంపాదిస్తున్నానని ప్రధానమంత్రికి చెప్పారు. సవాళ్ల గురించి అడిగినప్పుడు ఆమె గర్వంగా “ఇప్పుడు మాకు ఎలాంటి సమస్యలు లేవు. ప్రజలు మమ్మల్ని గౌరవంగా గుర్తిస్తున్నారు” అని అన్నారు.

లక్నోకు చెందిన బ్యాంకింగ్ సఖి సరళ… తాను మంచి జీవనోపాధి పొందుతూనే ప్రజలకు బ్యాంకు ఖాతాలు తెరవడంలో ఎలా సహాయపడిందో ప్రధానమంత్రికి వివరించారు. మొదట్లో ప్రజల నమ్మకాన్ని పొందడం సవాలుగా ఉండేదని, కానీ ఈ రోజు తన పనికి విస్తృత గౌరవం లభిస్తోందని ఆమె గుర్తుచేసుకున్నారు. తాను 2,000 పైగా జన్ ధన్ ఖాతాలు, 700 సురక్షా బీమా ఖాతాలు, 200 జీవన్ జ్యోతి బీమా ఖాతాలు, 200 అటల్ పెన్షన్ యోజన ఖాతాలు తెరవడంలో సహాయపడినట్లు సరళ గర్వంగా ప్రధాని మోదీకి తెలిపారు.

వారణాసికి చెందిన నీతూ సింగ్… నమో డ్రోన్ దీదీగా తన స్ఫూర్తిదాయక కథను పంచుకున్నారు. ఆమె పొలాల్లో ఎరువులు చల్లడానికి డ్రోన్ ఆపరేషన్లలో నైపుణ్యం సాధించారు.  గత 18 నెలల్లో, 1,000 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమికి మందులు చల్లారు.

బిజ్నోర్‌కు చెందిన జూలీ దేవి… విదుర్ పేడా కమిటీతో అనుబంధం ఉన్న 15,000 మంది మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తూ, తమ సంస్థ గురించి మాట్లాడారు. ఈ సంస్థ సబ్బు, మసాలాలు, మల్టీగ్రెయిన్ పిండి, శనగపిండితో సహా సుమారు 150 ఉత్పత్తులను తయారు చేస్తుంది. 2017కు ముందు భయం, బలహీనమైన శాంతిభద్రతల వ్యవస్థ కారణంగా మహిళలు వ్యాపారంలోకి అడుగుపెట్టడం ఊహించడం కూడా అసాధ్యమని ఆమె గుర్తుచేసుకున్నారు. ఈ రోజు మహిళలు తమ ఇళ్లను నిర్వహించడమే కాకుండా, ఆత్మవిశ్వాసంతో, భయం లేకుండా వ్యాపారాలు కూడా నడుపుతున్నారని ఆమె అన్నారు.

గోరఖ్‌పూర్‌కు చెందిన డెయిరీ పారిశ్రామికవేత్త కౌశల్య కూడా ప్రధానమంత్రిని కలిసి, తనకు స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని అందించే విజయవంతమైన డెయిరీ వ్యాపారాన్ని ఎలా నిర్మించుకున్నారో పంచుకున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sabarimala Karthika Deepam: స్వామియే శరణం.. శబరిమల కార్తీక దీపం చూశారా? | Asianet News Telugu
Putin RaGhat Visit:రాజ్ ఘాట్ సందర్శించనున్న పుతిన్.. ఢిల్లీలో భారీగా భద్రత | Asianet News Telugu