
CAG Report : ఉత్తర ప్రదేశ్ ఇప్పుడు ఆర్థిక రంగంలో దేశం దృష్టిని ఆకర్షించే స్థాయికి చేరుకుంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తాజా నివేదికలో రెవెన్యూ మిగులు ఉన్న 16 రాష్ట్రాల జాబితాలో యూపీ అగ్రస్థానంలో నిలిచింది. 2023 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం ₹37,000 కోట్ల రెవెన్యూ మిగులును నమోదు చేసింది. ఈ విజయం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విధానాల వల్లే సాధ్యమయ్యింది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వ పథకాలు యూపీ ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా దేశానికే రొల్ మోడల్ గా నిలబెట్టాయి.
యూపీ తర్వాత గుజరాత్, ఒడిశా, జార్ఖండ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు కూడా మిగులులో ఉన్నాయని కాగ్ నివేదిక చెబుతోంది. వీటిలో చాలా వరకు బీజేపీ పాలనలోనే ఉన్నాయి. అరుణాచల్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం వంటి ఈశాన్యంలోని అనేక చిన్న రాష్ట్రాలు కూడా మిగులులో ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు.
యూపీ వంటి రాష్ట్రాలు మిగులులో ఉండగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, పంజాబ్ వంటి 12 రాష్ట్రాలు ఇప్పటికీ లోటుతో ఇబ్బంది పడుతున్నాయి. నివేదిక ప్రకారం, ఈ రాష్ట్రాల ఆదాయం వారి అవసరాలను తీర్చలేకపోతోంది, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లపై ఆధారపడాల్సి వస్తోంది.
కాగ్ నివేదిక యూపీ ఆర్థిక విజయాలను ప్రత్యేకంగా హైలైట్ చేసింది.
ఈ నివేదిక కేవలం అంకెల కథ కాదు, ఒకప్పుడు వెనుకబాటుతనం, ఆర్థిక సంక్షోభానికి ప్రతీకగా నిలిచిన యూపీ ఇప్పుడు పెట్టుబడులకు, అభివృద్ధికి కేంద్రంగా మారుతోందని చెబుతోంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రెవెన్యూ సేకరణ, బడ్జెట్ నిర్వహణ, ఆర్థిక సంస్కరణల ద్వారా సాధించిన ఫలితాలు యూపీ ప్రతిష్టను మార్చాయి.