పాము కాటుతో భార్యను చంపిన భర్త: సూరజ్‌కి డబుల్ జీవిత ఖైదు

By narsimha lodeFirst Published Oct 13, 2021, 3:29 PM IST
Highlights

 పాము కాటుతో భార్యను హత్య చేయించిన భర్త సూరజ్ కు కొల్లం కోర్టు డబుల్ జీవిత ఖైదు విధించింది.  అయితే ఈ తీర్పుపై ఉత్తర తల్లిదండ్రులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిందితుడికి మరణశిక్ష విధించాలని వారు కోరుతున్నారు.ఈ విషయమై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేస్తామన్నారు.
 


తిరువనంతపురం: పాము కాటుతో తన భార్యను హత్యచేసిన పట్నంతిట్టకు చెందిన సూరజ్‌రకు 17 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రెండు జీవిత ఖైదులను విధిస్తూ కొల్లం అదనపు సెషన్స్ కోర్టు  జడ్జి manoj బుధవారం నాడు తీర్పు వెల్లడించారు.

నిందితుడు మొదట 17 ఏళ్లు కఠిన జైలు శిక్షను అనుభవించాలి., ఆ తర్వాత ఆయనకు డబుల్ జీవిత ఖైదు అమల్లోకి రానుంది.నిందితుడికి ప్రభుత్వం ఉపశమనం కల్గిస్తే అతను జీవితాంతం జైల్లోనే ఉంటాడు. అయితే ఈ తీర్పుపై మృతురాలి కుటుంబసభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తన కూతురిని చంపిన సూరజ్ కు మరణశిక్ష విధించాలని వారు కోరుతున్నారు.

ఈ విషయమై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేస్తామని ఉత్తర తల్లి మేఘమాల పేర్కొన్నారు. చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని నిందితులు తప్పించుకొంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. కఠినమైన శిక్షలు పడితే మరొకరు తప్పు చేసేందుకు భయపడుతారన్నారు.నిందితుడికి గతంలో నేర చరిత్ర లేనందున సూరజ్ కు మరణ శిక్ష నుండి తప్పించింది కోర్టు. సూరజ్ తన భార్య ఉత్తరను పథకం ప్రకారం హత్య చేశాడు. అయితే పాము కాటుకు తన భార్య చనిపోయిందని నమ్మించాడు.

also read:పాముతో కరిపించి భార్య హత్య. ధోషిగా తేలిన భర్త..!

2020 మే 7వ తేదీన ఉత్తర తన బెడ్‌రూమ్‌లో మృతి చెందింది.అంతకుముందు కూడ ఆమె   రెండు దఫాలు పాము కాటుకు గురైంది. మూడుసార్లు ఉత్తరను పాము కాటు వేయడంపై అనుమానం వచ్చిన ఉత్తర పేరేంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రెండు దఫాలు పాము కాటు నుండి కోలుకొంది. అయితే మూడో ప్రయత్నంలో భార్య తప్పించుకోకండా ఉండేందుకు సూరజ్ పక్కా ప్లాన్ చేశాడు. రాత్రి పడుకోబోయే ముందు ఉత్తరకు నిందితుడు సూరజ్ పండ్ల రసంలో మత్తు మందు కలిపి ఇచ్చాడు. దీంతో ఉత్తర నిద్రలోకి జారిపోయింది. ఆ తర్వాత పాముతో ఆమెకు కాటు వేయించాడని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.

 ఉత్తర వికలాంగురాలు. ఆమెకు ఉన్న ఆస్తిపై మోజుతోనే సూరజ్‌ పెళ్లి చేసుకొన్నాడని పోలీసులు గుర్తించారు. ఈ జంటకు ఏడాదిన్నర కూతురు కూడా ఉంది. మరో మహిళను వివాహం చేసుకోవాలనే ఉద్దేఃశ్యంతోనే నిందితుడు సూరజ్ ఈ దారుణానికి పాల్పడినట్టుగా పోలీసులు తేల్చారు.

ఈ కేసుకు సంబంధించి పోలీసులు శాస్త్రీయమైన ఆధారాలను కోర్టుకు సమర్పించారు.  మృతురాలిని కరిచిన పాము నుండి సేకరించిన ఆనవాళ్లతో ఉత్తర శరీరంలోని పాము విషం ఆనవాళ్లు సరిపోయాయి. అంతేకాదు పాములు పట్టే వ్యక్తికి సంబంధించిన ఆధారాలను కూడ కోర్టుకు పోలీసుులు సమర్పించారు.


 

click me!