అలా చేసారో... జీవితంలో ఎప్పటికీ అమెరికాలో అడుగుపెట్టలేరు : ఇండియన్ ఎంబసీ వార్నింగ్

Published : May 17, 2025, 02:34 PM ISTUpdated : May 17, 2025, 02:37 PM IST
అలా చేసారో... జీవితంలో ఎప్పటికీ అమెరికాలో అడుగుపెట్టలేరు : ఇండియన్ ఎంబసీ వార్నింగ్

సారాంశం

అక్రమ వలసలపై అమెరికా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా అక్రమ వలదారులకు అమెరికాలోని ఇండియా ఎంబసీ కీలక సూచనలు చేసింది. 

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అక్రమ వలసదారులపై యాక్షన్ ప్రారంభించారు. ఇప్పటికే భారత్ తో సహా వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారులను గురించడమే కాదు కొందరిని వెనక్కికూడా పంపించారు. అయితే తాజాగా అనుమతి కంటే ఎక్కువ కాలం అమెరికాలో ఉంటే తాత్కాలిక బహిష్కరణ మాత్రమే కాదు శాశ్వతంగా ఈ దేశానికి వెళ్లకుండా నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుందట. ఈ మేరకు అమెరికాలో భారతీయులకు అక్కడి మనదేశ ఎంబసీ అధికారులు హెచ్చరించారు. 

"మీరు అనుమతి పొందిన కాలంకంటే ఎక్కువరోజులు యూఎస్ లో ఉంటే మిమ్మల్ని బహిష్కరించవచ్చు, భవిష్యత్తులో ఇక ఎన్నడూ యూఎస్ కి ప్రయాణించకుండా శాశ్వత నిషేధం విధించవచ్చు" అని పేర్కొంది.



ట్రంప్ ప్రభుత్వం వలసదారులను వారి స్వదేశానికి కాకుండా ఇతర దేశాలకు ముందస్తు నోటీసు లేకుండా పంపించడాన్ని ఫెడరల్ అప్పీల్స్ కోర్టు అనుమతించలేదని సిఎన్ఎన్ నివేదించింది. దిగువ కోర్టు నిర్ణయాన్ని అడ్డుకునే అభ్యర్థనను అప్పీల్స్ కోర్టు తిరస్కరించింది. వలసదారులను లిబియాకు పంపాలనే ప్రణాళికలపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

 

PREV
Read more Articles on
click me!