శశి థరూర్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందంలో చేర్చకపోవడం వివాదం

Published : May 17, 2025, 01:55 PM IST
శశి థరూర్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందంలో చేర్చకపోవడం వివాదం

సారాంశం

పాక్‌ను ఎండగట్టేందుకు కేంద్రం 7 ప్రతినిధి బృందాలు ఏర్పాటు చేసింది. శశిథరూర్ అనూహ్యంగా చోటు దక్కించుకోగా, కాంగ్రెస్ పంపిన జాబితాలో ఆయన పేరు లేదు.

భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌ను ప్రపంచ స్థాయిలో ఏకాకిని చేయాలని కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. ఈ లక్ష్యంతో పాక్ కుట్రలను ఇతర దేశాలకు వివరించేందుకు భారత ప్రభుత్వం ఏడు ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేసింది. వీటికి నేతలుగా ఎంపీలు వ్యవహరించనున్నారు. ఆశ్చర్యకరంగా.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అయితే పార్టీ పంపిన అధికారిక పేర్లలో మాత్రం ఆయన పేరు లేదు.

మే 16న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్‌ను బృందాల కోసం పేర్లు పంపమని కోరగా, రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ నాలుగు పేర్ల జాబితాను పంపింది. ఆ జాబితాలో ఆనంద్ శర్మ, సయ్యద్ నజీర్ హుస్సేన్, రాజా బ్రార్, గౌరవ్ గొగొయ్ ల పేర్లు ఉన్నాయని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తెలిపారు. కానీ చివరకు కేంద్రం విడుదల చేసిన జాబితాలో వీరి ఎవరి పేర్లూ కనిపించలేదు.అయితే తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ మాత్రం కేంద్ర బృందాల్లో భాగమయ్యారు. దేశ ప్రయోజనాల కోణంలో ఈ బాధ్యతను తీసుకోవడం గర్వంగా ఉందని థరూర్ తన స్పందనలో తెలిపారు.

కేంద్రం విడుదల చేసిన తుది జాబితాలో థరూర్‌తో పాటు భాజపా నేతలు రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, జేడీయూ నుంచి సంజయ్ కుమార్ ఝా, డీఎంకే నాయకురాలు కనిమొళి, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే, శివసేన ఎంపీ శ్రీకాంత్ శిందే ఉన్నారు.ఈ బృందాలు విదేశాల్లో పాకిస్థాన్‌ ఉగ్ర మద్దతును వివరిస్తూ.. భారతదేశం ఇటీవల ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఉగ్రవాదంపై తీసుకున్న చర్యలను అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించనున్నాయి. పాక్ చేస్తున్న కుట్రలను నిష్పాక్షిక ఆధారాలతో వివరించడమే ఈ బృందాల ప్రధాన లక్ష్యం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu