కేదార్‌నాథ్‌లో హెలి అంబులెన్స్ ప్రమాదం (Watch Video)

Published : May 17, 2025, 02:10 PM ISTUpdated : May 17, 2025, 02:11 PM IST
కేదార్‌నాథ్‌లో హెలి అంబులెన్స్ ప్రమాదం (Watch Video)

సారాంశం

కేదార్‌నాథ్‌లో హెలి అంబులెన్స్ క్రాష్ ల్యాండ్ అయ్యింది. రిషికేష్ ఎయిమ్స్ కు చెందిన ఈ హెలికాప్టర్ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.    

చార్ ధామ్ యాత్రలో పెను ప్రమాదం తప్పింది. రిషికేష్ ఎయిమ్స్ నుండి కేదార్‌నాథ్‌ చేరుకున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయ్యింది. అయితే పైలట్ ఛాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. 

ఈ హెలికాప్టర్ రిషికేష్ ఎయిమ్స్ నుండి ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ కోసం కేదార్‌నాథ్‌కి వచ్చింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో పైలట్ తో పాటు ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు... అదృష్టవశాత్తూ అందరూ సురక్షితంగానే ఉన్నారు.

 

టెక్నికల్ లోపంతోనే క్రాష్

హెలికాప్టర్ పేషెంట్‌ని తీసుకెళ్లడానికి వచ్చిందని... కానీ ల్యాండింగ్ సమయంలో టెక్నికల్ లోపంతో క్రాష్ అయ్యిందని అధికారులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈ హెలి అంబులెన్స్ ప్రమాదంపై విచారణ చేపట్టారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !