ప్రధాని నరేంద్ర మోడీ అంతరిక్ష రంగానికి తాళాలు తెరిచారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. చంద్రయాన్-3 ద్వారా సేకరించిన సమాచారం భారత్ షేర్ చేస్తే తెలుసుకునేందుకు అమెరికా, రష్యా లు ఎంతో ఆసక్తిగా ఎందురు చూస్తున్నాయని చెప్పారు.
అమెరికా, రష్యాలు భారత్ షేర్ చేసే చంద్రయాన్ -3, ఆదిత్య ఎల్ 1 లకు సంబంధించిన సమాచారం కోసం ఎదురు చూస్తున్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఈ ప్రాజెక్టుల విజయానికి ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా అంతరిక్ష రంగాన్ని అన్ లాక్ చేయాలన్న ప్రధాని నరేంద్ర మోడీ విధానమే కారణమని అన్నారు.
భారత్ పంపిన చంద్ర, సౌర మిషన్లు వేగవంతమైన దేశ అభివృద్ధికి ప్రతీక అని జితేంద్ర సింగ్ నొక్కి చెప్పారు. ‘మన మిషన్లు దాదాపు ఒకేసారి ప్రారంభమయ్యాయి. చంద్రయాన్ -3 ప్రత్యేకత ఏంటంటే అది దక్షిణ ధృవం (చంద్రుని) మీద దిగడం. వాతావరణం, ఖనిజాలు, ఉష్ణ పరిస్థితులపై కీలక సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఫలితాలను విశ్లేషిస్తున్నాయి’’ అని ఆయన తెలిపారు.
భారత్ కంటే ముందే ఈ ప్రయాణాన్ని పలు దేశాల ప్రారంభించాయి. ముఖ్యంగా అమెరికా, రష్యాలు మన దేశం షేర్ చేసే సమాచారం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ‘‘అమెరికా 1969లో చంద్రుడిపై తొలిసారిగా మనిషిని దింపింది. కానీ మన చంద్రయాన్ -3 నీరు (చంద్రుడిపై) - హెచ్ 2ఓ అణువు ఉనికికి ఆధారాలు తెచ్చింది. ఇది (చంద్రుడిపై) జీవించే అవకాశాన్ని సూచిస్తుంది. ఇది దర్యాప్తులో కీలకమైన అంశం’’ అని తెలిపారు.
పూరీ జగన్నాథ ఆలయంలో భక్తుల రద్దీ.. తోపులాటలో 30 మందికి గాయాలు
నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) కూడా ఇప్పుడు భారత్ మద్దతు కోరుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. అనంతరం ఆయన ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. 'ఆదిత్య మిషన్ గణనీయమైన మీడియా కవరేజీని పొందింది, శ్రీహరికోట (ఆంధ్రప్రదేశ్) లో 10,000 మంది దీనిని వీక్షించారు’’ అని మంత్రి చెప్పారు.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, 6 మృతి, 60 మందికి గాయాలు...
ప్రధాని మోడీ చొరవతో శ్రీహరికోట, ఇస్రో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యానికి తెరతీశాయని జితేంద్ర సింగ్ తెలిపారు. గత మూడు నాలుగేళ్లలో అంతరిక్ష రంగంలో 150కి పైగా స్టార్టప్ లు వచ్చాయని, కొందరు ఇప్పటికే పారిశ్రామికవేత్తలుగా మారారని తెలిపారు. దీని వల్ల గతంలో విదేశాల్లో అవకాశాల కోసం ఎదురుచూసిన ప్రతిభావంతులైన యువకులు ఇప్పుడు దేశీయంగా అంతరిక్ష రంగంలో ఎదుగుతున్నారని అన్నారు. ఈ రంగంలో స్పెషలైజేషన్ ఉన్నప్పటికీ ఇక్కడ అవకాశం లేకపోవడంతో యువకులు దేశం విడిచి వెళ్లిపోయేవారని తెలిపారు. అయితే ప్రధాని మోడీ అంతరిక్ష రంగాన్ని అన్ లాక్ చేశారని కొనియాడారు.