వాయుకాలుష్యం : ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ ట్రాఫిక్ జామ్.. ఇరుక్కుపోయిన అంబులెన్స్..

By SumaBala Bukka  |  First Published Nov 11, 2023, 8:43 AM IST

దీపావళికి రెండు రోజుల ముందు ధన్‌తేరస్‌లో భాగంగా షాపింగ్ కోసం కార్లలో బైటికి రావడంతో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో గంటల తరబడి ఇందులో చిక్కుకుని నరకం చూశారు. 


న్యూఢిల్లీ : దిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేలో భారీ ట్రాఫిక్ జామ్‌ నెలకొంది. దీపావళి సందర్భంగా సొంతఇళ్లకు బయలుదేరడంతో ట్రాఫిక్ గణనీయంగా జామ్ అయ్యింది. గంటలకొద్దీ ట్రాఫిక్ లో చిక్కుకుని అష్టకష్టాలు పడ్డారు. గంటకు టోల్ ప్లాజా సమీపంలో ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుంది ఓ అంబులెన్స్. ట్రాఫిక్‌ను దాటుకుని పేషంట్ ను సురక్షితంగా ఆస్పత్రికి చేర్చడానికి అంబులెన్స్ ప్రయత్నిస్తున్న వీడియో వైరల్ అయ్యింది. 

ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే పై ఎనిమిది లేన్‌లుగా ఉన్నాయి. అయినా కూడా, ప్రతిరోజూ ట్రాఫిక్ జామ్‌ జరుగుతూనే ఉంది. శుక్రవారం ధన్‌తేరస్‌ రద్దీ కారణంగా పరిస్థితి మరింత తీవ్రమైంది. ప్రజలు షాపింగ్ చేయడానికి, బంధువులను కలవడానికి బయలుదేరడంతో ఈ ట్రాఫిక్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదు రోజుల దీపావళి ఉత్సవాల ప్రారంభరోజైన ధన్‌తేరస్‌ నాడుబంగారం, వెండి, ఇతర లోహాలతో చేసిన వస్తువులను కొనుగోలు చేయడం ఆనవాయితీ. 

Latest Videos

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, 4 మృతి, 60 మందికి గాయాలు...

ట్రాఫిక్‌లో వందలాది వాహనాలు ఇరుక్కుపోయాయి. ఇందులో ఒక అంబులెన్స్‌ ఇరుక్కుపోయినట్లుగా వీడియో చూపిస్తుంది. కిలోమీటరుకు పైగా జామ్‌ ఏర్పడడంతో వాహనాలు నత్తనడకన సాగుతున్నాయి. ధన్‌తేరస్‌తో పాటు ఆదివారం దీపావళి సందర్భంగా భారీ ట్రాఫిక్‌ ఉండొచ్చని.. ఢిల్లీ పోలీసులు గురువారం జారీ చేసిన ప్రకటనలో హెచ్చరించారు.

"దీపావళికి ముందు నగర రోడ్లపై ముఖ్యంగా షాపింగ్ మాల్స్ చుట్టూ, చాందినీ చౌక్, ఖారీ బావోలి, కన్నాట్ ప్లేస్, కరోల్ బాగ్, సరోజినీ నగర్, సదర్ బజార్, సెంట్రల్ మార్కెట్ లజ్‌పత్ నగర్‌తో సహా రద్దీగా ఉండే అధిక ఫుట్‌ఫాల్ మార్కెట్ ప్రాంతాల చుట్టూ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. నెహ్రూ ప్లేస్, గ్రేటర్ కైలాష్, తిలక్ నగర్, గాంధీ నగర్, కమలా నగర్ మరియు రాజౌరి గార్డెన్, ”అని అడ్వైజరీ పేర్కొన్నట్లు పీటీఐ నివేదిక తెలిపింది.

"అసౌకర్యాన్ని నివారించడానికి, సమయాన్ని, ఇంధనాన్ని ఆదా చేయడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి, బస్సు, మెట్రో, కార్‌పూల్ వంటి ప్రజా రవాణా సేవలను ఉపయోగించుకోవాలని సాధారణ ప్రజలకు సూచించబడింది. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు, ట్రాఫిక్ హెల్ప్‌లైన్ సోషల్ మీడియా సేవలతో అనుసంధానం చేయడం ద్వారా తదనుగుణంగా అవాంతరాలు లేని ప్రయాణానికి మరింత సహాయపడుతుంది" అని తెలిపారు.

click me!