
ముంబయి: భారత్‌కు అమెరికా నూతనంగా నియమించిన రాయబారి ఎరిక్ గార్సెట్టీ మంగళవారం బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌ను కలిశారు. ముంబయిలోని షారుఖ్ ఖాన్ నివాసం మన్నత్‌కు ఆయన వెళ్లారు. బాలీవుడ్, ప్రపంచవ్యాప్తంగా అది వేస్తున్న సాంస్కృతిక ముద్ర గురించి ఇరువురూ చర్చించారు.
కింగ్ ఖాన్ నివాసం మన్నత్‌లో ఆయన పర్యటన గురించి ఎరిక్ గార్సెట్టీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. బాలీవుడ్‌లో అరంగేట్రం చేయడానికి ఇదే సమయమా? మన్నత్ నివాసంలో షారుఖ్ ఖాన్‌తో మంచి సంభాషణ జరిగినట్టు వివరించారు. ముంబయిలోని ఫిలిం ఇండస్ట్రీ గురించి ఎన్నో విషయాలను తెలుసుకున్నామని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా బాలీవుడ్, హాలీవుడ్ వేసే సాంస్కృతిక ప్రభావం గురించి చర్చించుకున్నామని వివరించారు. ఈ ట్వీట్‌తోపాటు షారుఖ్ ఖాన్‌తో దిగిన ఫొటోలనూ ఆయన షేర్ చేశారు.
మరో చిత్రంలో గార్సెట్టీ పసుపు వర్ణం ఫుట్ బాల్ చేతిలో పట్టుుకుని ఉండగా.. ఆమె చుట్టూ షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లాని, ఆయన భార్య గౌరీ ఖాన్‌లు ఉన్నారు. పఠాన్ యాక్టర్ షారుఖ్ ఖాన్ కూడా బ్లాక్ టీషర్ట్, బ్లాక్ ప్యాంట్‌లో కనిపించారు. గుజరాత్‌లో అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమానికి ఆయన పర్యటించిన మరుసటి రోజు ముంబయికి విచ్చేశారు.
అహ్మదాబాద్‌లో స్థానికులు ఆయనకు పూలమాలలు వేస్తూ స్వాగతం పలికారు. నమస్తే అని సాంప్రదాయంగా విష్ చేశారు.
Also Read ఒడిశా తొలి వందే భారత్ రైలు ప్రారంభం.. సాంకేతికత దేశంలో వివిధ మూలలకు చేరుతుందన్న మోదీ..
మే 11వ తేదీన యూఎస్ రాయబారి గార్సెట్టి, ఖతార్, మొనాకలో రాయబారులూ తమ క్రెడెన్షియల్స్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అప్పగించారు. ద్రౌపది ముర్ము వారి క్రెడెన్షియల్స్ అంగీకరించిన తర్వాత గార్సెట్టీ ఓ వీడియో మెస్సేజీ విడుదల చేశఆరు. ప్రపంచలో ప్రాచీనమైన, పెద్దదైన ప్రజాస్వామ్యాలు.. ప్రజలే పాలకులను మనసా వాచా విశ్వసించే ఈ రెండు దేశాలు కలిసి చరిత్రలో గొప్ప అధ్యాయాలు లిఖిస్తాయని భావించారు. ఇండో పసిఫిక్ రీజియన్, దానికి ఆవల కూడా స్వేచ్ఛ, సుసంపన్నం ఉండాలంటే ఈ రెండు దేశాల భాగస్వామ్యం ముఖ్యమని వివరించారు. 21వ శతాబ్దపు భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి తాను శాయశక్తుల పని చేస్తానని తెలిపారు.
ఆరోగ్య సవాళ్లు, పర్యావరణ మార్పులను ఎదుర్కోవడం, వచ్చే తరాలకు అద్భుతమైన టెక్నాలజీని అందించి వారి జీవితాలను మెరుగుపరచడంలో ఉభయ దేశాలు దృష్టి సారించాలని ఆయన తెలిపారు. భారత్, అమెరికా కలిసి ఎంత మెరుగైన స్థాయిలో ఉన్నాయో ప్రపంచానికి చాటుతున్నామని వివరించారు.
భారత్‌కు 26వ అంబాసిడర్‌గా ఎంపిక చేసినందుకు అధ్యక్షుడు జో బైడెన్‌కు కృతజ్ఞతలు అని వివరించారు. లాస్ ఏంజెల్స్ మాజీ మేయర్ అయిన గార్సెట్టి ఏడాది మార్చిలో కొత్త అమెరికా రాయబారిగా ప్రమాణం తీసుకున్నారు.