జల్లికట్టు: తమిళనాడు సర్కార్ కు సుప్రీంలో ఊరట

Published : May 18, 2023, 02:32 PM IST
జల్లికట్టు: తమిళనాడు సర్కార్  కు సుప్రీంలో  ఊరట

సారాంశం

జల్లికట్టుపై  తమిళనాడు  సర్కార్ కు సుప్రీంకోర్టులో  ఊరట లభించింది.    

చెన్నై: జల్లికట్టు విషయంలో  తమిళనాడు  ప్రభుత్వానికి  ఊరట లభించింది.  జల్లికట్టుపై  తమిళనాడు  చట్టాన్ని  సుప్రీంకోర్టు  సమర్ధించింది.  జంతు హింస  చట్టం జల్లికట్టుకు వర్తించదని సుప్రీంకోర్టు  గురువారంనాడు   తెలిపింది .2014లో  ఇచ్చిన తీర్పును  సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం  సవరించింది.  

జల్లికట్టు తమిళనాడు  సంస్కృతిలో  భాగమని  తమిళనాడు  ప్రభుత్వం  చెప్పిన విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది.  జల్లికట్టు సంస్కృతిలో  భాగమా, కాదా తేల్చాల్సింది  తాము కాదని కోర్టు  తెలిపింది. 

2017లో  జల్లికట్టుకు  అనుకూలంగా  తమిళనాడు  రాష్ట్ర ప్రభుత్వం  చట్టం చేసింది. తమిళనాడు  రాష్ట్ర ప్రభుత్వ ం చేసిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ  సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ  చేసిన  సుప్రీంకోర్టు  తమిళనాడు  సర్కార్ చేసిన చట్టాన్ని  సమర్ధించింది.

తమిళనాడు రాష్ట్రంలో  పొంగల్ పండుగను పురస్కరించుకొని  జల్లికట్టును నిర్వహిస్తారు.  ఎద్దులను  లొంగదీసుకోవడానికి  యువకులు  పోటీ పడుతారు. ఎద్దులను లొందీసుకొనేందుకు  యువకులు పెద్ద ఎత్తున పోటీపడతారు.  ఈ పోటీలను తిలకించేందుకు  ప్రజలు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఎద్దులను లొంగదీసుకొనే క్రమంలో  పెద్ద ఎత్తున యువత  గాయాలపాలౌతుంటారు.  

జల్లికట్టు విషయంలో  తమిళనాడు సర్కార్  చేసిన చట్టాన్ని  సుప్రీంకోర్టు   సమర్ధించడాన్ని తమిళనాడు  న్యాయశాఖ మంత్రి  రఘుపతి  స్వాగతించారు.  ఈ  తీర్పు చారిత్రాత్మకంగా  పేర్కొన్నారు.జల్లికట్టులో  జంతువులపై హింస లేదని  ఆయన  తేల్చి చెప్పారు. జల్లికట్టుకు  తమిళనాడు  ప్రభుత్వం  అనుమతిస్తూ  చట్టం చేయడాన్ని  పీపుల్ ఫర్ ట్రీట్ మెంట్  ఆఫ్ యానిమల్స్  వంటి సంస్థలు  తీవ్రంగా వ్యతిరేకించాయి.

జల్లికట్టు విషయంలో సుప్రీంకోర్టు  ఇవాళ  ఇచ్చిన తీర్పు తమిళనాడుకు  వ్యతిరేకమైందని  పెటా  సంస్థ  అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు తీర్పుపై  మీడియాకు  పెటా సంస్థ  ప్రకటనను విడుదల  చేసింది. 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..