గుజరాత్‌ ఎన్నికల్లోనూ పట్టణవాసుల ఉదాసీనత: ఎన్నికల సంఘం.. ఓటేయాలని ఈసీ అప్పీల్

By Mahesh KFirst Published Dec 3, 2022, 7:19 PM IST
Highlights

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పడిపోయింది. పట్టణాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. అందుకే పోలింగ్ శాతం పెంచడానికి ఓటర్లకు ఎన్నికల సంఘం అప్పీల్ చేయడానికి ఈ రోజు ప్రత్యేక సమావేశం నిర్వహించింది.
 

న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఇందులో పోలింగ్ శాతం పడిపోయింది. దీనిపై ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఓటర్లకు అప్పీల్ చేసింది. పట్టణ ఉదాసీనతను వదలాలని వివరించింది.

సూరత్, రాజ్‌కోట్, జామ్‌నగర్‌లలో రాష్ట్ర సగటు ఓటింగ్ శాతం కంటే కూడా తక్కువగా నమోదైందని ఈసీ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో 66.755 శాతం పోలింగ్ నమోదవ్వగా, ఆ నగరాల్లో 63.3 శాతమే నమోదైందని వివరించింది. 2017 అసెంబ్లీ తొలి దశ ఎన్నికల్లో 66.75 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.

చాలా నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెరిగిందని, కానీ, పట్టణ ఉదాసీనత కారణంగా మొత్తం పోలింగ్ శాతం తగ్గిపోయిందని ఈసీ తెలిపింది. ఇటీవలే జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ షిమ్లాలో ఈ ఉదాసీనత కనిపించిందని గుర్తు చేసింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతం 75.6గా ఉండగా, షిమ్లాలో 13 పాయింట్లు తక్కువగా అంటే 62.53 శాతం పోలింగ్ నమోదైందని తెలిపింది.

Also Read: గుజరాత్‌లో ముగిసిన తొలి విడత పోలింగ్: 56.88 శాతం ఓటింగ్ నమోదు

అదే తీరులో గుజరాత్ నగరాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైందని వివరించింది. డిసెంబర్ 1వ తేదీన తొలి దశ పోలింగ్‌లో అందుకు ఓటింగ్ పర్సెంటేజీ తగ్గిందని తెలిపింది.

ఇదిలా ఉండగా రెండో దశ ఎన్నికల కోసం గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం శనివారం 5 గంటలతో తెర పడింది. రెండో దశ ఎన్నికలు 14 జిల్లాల్లోని 93 నియోజకవర్గాల్లో జరుగుతుంది. అహ్మదాబాద్, వడోదర, గాంధీనగర్ వంటి కీలక నగరాలు ఇందులో ఉన్నాయి. ఉత్తర, మధ్య గుజరాత్‌లో రెండో దశ పోలింగ్ ఉంది. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8వ తేదీన జరుగుతుంది. తొలి దశ పోలింగ్‌లో 89 సీట్లకు గురువారం జరిగిన సంగతి తెలిసిందే.

రెండో దశలో సీఎం భుపేంద్ర పటేల్, పాటిదార్ లీడర్ హార్దిక్ పటేల్, ఓబీసీ నేత అల్పేశ్ ఠాకూర్‌ సహా పలువురు కీలక నేతలు పోటీ పడుతున్నారు. ఇక్కడ బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు ఉన్నది.

click me!