పొట్టిగా ఉండడం వల్ల పెళ్లి కావట్లేదని మనస్తాపం.. యువతి ఆత్మహత్య..

Published : Jun 10, 2023, 07:19 AM IST
పొట్టిగా ఉండడం వల్ల పెళ్లి కావట్లేదని మనస్తాపం.. యువతి ఆత్మహత్య..

సారాంశం

పొట్టిగా ఉండడం వల్ల పెళ్లి కావట్లేదన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య కు పాల్పడింది. ఈ ఘటన ఝార్ఖండ్ లో వెలుగు చూసింది. 

ఝార్ఖండ్ : పెళ్లి సంబంధాలు కుదరడం లేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జార్ఖండ్లో వెలుగు చూసింది.  తాను ఎత్తు తక్కువగా ఉండడంవల్ల వచ్చిన సంబంధాలన్నీ తప్పిపోతున్నాయి అని మనస్థాపానికి గురైంది. ఇప్పటికే మూడు పెళ్లి సంబంధాలు తప్పిపోయాయి. దీంతో బెంగ పెట్టుకున్న శ్వేత (22) అనే యువతి  ఝార్ఖండ్లో రాంచి సమీప పుండగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బలవన్మరణానికి పాల్పడింది. ఆ మూడు పెళ్లి చూపుల్లోనూ.. చివరిదాకా వచ్చి చెడిపోయాయి. 

దీనికి కారణం తాను పొట్టిగా ఉండడమే. తన ఎత్తు కారణంగా సంబంధాలు  తప్పిపోతుండడంతో శ్వేత తీవ్రమనస్థాపానికి గురైంది. తీవ్ర ఆవేదనకు లోనయ్యింది. దీంతో కుటుంబ సభ్యులు ఎంతగానో నచ్చ చెప్పారు. కానీ ఆమె ఆ బాధ నుంచి కోలుకోలేకపోయింది. బీహార్ లోని అరవల్ లో తల్లిదండ్రులు ఉంటున్నారు. జార్ఖండ్ లోని రాంచీలో అక్క శిల్పతో కలిసి శ్వేత ఉంటుంది. కాగా, పనిమీద తాను గురువారం రాత్రి బయటికి వెళ్లారని శిల్ప చెప్పింది. ఆ తర్వాత తమ పొరిగింటి వారు ఫోన్ చేసి శ్వేతా ఆత్మహత్య చేసుకుందామని తెలిపారని శిల్ప చెప్పింది విషయం పోలీసులకు తెలియడంతో అక్కడిచేరుకున్న పోలీసులు శ్వేత మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. 

కూతురి ప్రేమను కాదన్నందుకు తల్లిని హత్య చేసిన ప్రియుడు...

ఇదిలా ఉండగా, గతంలో ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో వెలుగు చూసింది. చిన్న చిన్న కారణాలకే మనస్తాపం చెందడం. ఆత్మహత్యలకు పాల్పడడం ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి  ఓ విషాద సంఘటన నగరంలోని కూకట్పల్లిలో చోటు చేసుకుంది. వయసు మీరుతున్నా పెళ్లి కావడం లేదని మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వివరాల ప్రకారం.. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేక్ నగర్ లో విజయ లక్ష్మీ (26) అనే యువతి కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తోంది. 

ఆమెకు గత కొంతకాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే చాలామంది వచ్చి చూసి పోతున్నారే కానీ.. సంబంధం కుదరడం లేదు. తనకు పెళ్లి సంబంధాలు ఎన్ని వచ్చినా… వివాహం మాత్రం కావడంలేదని ఆమె తీవ్ర మనస్తాపం చెందింది. దీంతో జీవితంపై విరక్తితో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిగా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విజయలక్ష్మి  మృతి చెందింది. 

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?