యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల షెడ్యూల్ ను శుక్రవారం నాడు యూపీఎస్‌సీ విడుదల చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో నిర్ణీత షెడ్యూల్ ప్రకారంగా జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల షెడ్యూల్ ను శుక్రవారం నాడు యూపీఎస్‌సీ విడుదల చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో నిర్ణీత షెడ్యూల్ ప్రకారంగా జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు ఈ ఏడాది అక్టోబర్ 4వ తేదీన నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షలను 2021 జనవరి 8వ తేదీన నిర్వహించనున్నారు.
ఇవాళ ప్రత్యేక సమావేశం నిర్వహించిన తర్వాత కొత్త తేదీలను యూపీఎస్‌సీ ప్రకటించింది.
వాస్తవానికి ఈ ఏడాది మే 31వ తేదీన యూపీఎస్‌సీ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో అభ్యర్థుల నుండి వచ్చిన వినతి మేరకు ప్రిలిమినరీ పరీక్షలను వాయిదా వేశారు.
also read:కరోనా దెబ్బ: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా
ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. లాక్ డౌన్ పొడిగించినా కూడ పలు రంగాలపై ఆంక్షల్లో సడలింపులను ఇచ్చింది కేంద్రం.
ఈ నెల 8వ తేదీ నుండి మరిన్ని రంగాల్లో ఆంక్షలపై సడలింపులు ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం.గత ఏడాది సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ, మెయిన్స్ ద్వారా ఎంపికైన అభ్యర్థుల వ్యక్తిత్వ పరీక్షలు ఈ ఏడాది జూలై 20 నుండి ప్రారంభం కానున్నాయి.