యూపీలో విషాదం: స్కార్పియోను ఢీకొన్న ట్రక్కు.. తొమ్మిది మంది దుర్మరణం

Siva Kodati |  
Published : Jun 05, 2020, 05:33 PM IST
యూపీలో విషాదం: స్కార్పియోను ఢీకొన్న ట్రక్కు.. తొమ్మిది మంది దుర్మరణం

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రతాప్ గఢ్ జిల్లాలోని వాజిద్‌పూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున 5.35 గంటల సమయంలో స్కార్పియో వాహనం, ట్రక్కు ఢీకొన్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రతాప్ గఢ్ జిల్లాలోని వాజిద్‌పూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున 5.35 గంటల సమయంలో స్కార్పియో వాహనం, ట్రక్కు ఢీకొన్నాయి.

Also Read:షాకింగ్... 20 మంది మెట్రో సిబ్బందికి కరోనా

ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. మరణించిన వారిలో ఐదుగురు పోలీసులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

ఈ ఘటనలో గాయపడిన మరో చిన్నారని లక్నోలోని ఆసుపత్రికి తరలించారు. రాజస్థాన్ నుంచి బీహార్‌లోని భోజ్‌పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

Also Read:మరో జార్జ్ ఫ్లాయిడ్ ఘటన.. ఈసారి భారత్ లో..

ఈ ఘటనలో స్కార్పియో పూర్తిగా ధ్వంసం అవ్వడంతో మృతదేహాలను బయటికి తీయడం కష్టంగా మారింది. చివరికి గ్యాస్ కట్టర్లను ఉపయోగించి అతికష్టం మీద మృతదేహాలను వెలికితీశారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. 
 
PREV
click me!

Recommended Stories

రూ. 25 వేల‌కి పెరిగిన పీఎఫ్ సాల‌రీ లిమిట్‌.. దీంతో ఉద్యోగుల‌కు జ‌రిగే ప్ర‌యోజ‌నం ఏంటో తెలుసా?
ఈ ఫొటోలో ఉన్న వ్య‌క్తి ఆస్తి ల‌క్ష‌రాల రూ. 3 వేల కోట్లు.. ఇంత‌కీ ఎందుకిలా మారాడంటే