ఐ బ్రోస్ షేప్ చేయించుకున్నందుకు విడాకులు.. దుబాయ్ నుంచి ఫోన్‌లోనే త్రిపుల్ తలాఖ్

By Mahesh K  |  First Published Oct 31, 2023, 8:35 PM IST

యూపీలో ఓ ముస్లిం మహిళ పోలీసులను ఆశ్రయించి తన భర్త తనకు త్రిపుల్ తలాఖ్ చెప్పి విడాకులు ఇచ్చాడని ఫిర్యాదు చేసింది. ఐ బ్రోస్ షేప్ చేయించుకున్నందుకే విడాకులు ఇచ్చినట్టు ఆరోపించింది. తనకు న్యాయం జరిపించాలని ఫిర్యాదు ఇచ్చారు.
 


న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో త్రిపుల్ తలాఖ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం ఐ బ్రోస్ షేప్ చేయించుకున్నందుకు ఆమె భర్త ఆగ్రహానికి గురైంది. దీంతో ఫోన్‌లోనే త్రిపుల్ తలాఖ్ చెప్పాడు. ఇక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో.. నీకు ఈ పెళ్లి నుంచి విముక్తి ఇస్తున్నా అని పేర్కొంటూ విడాకులు ఇచ్చాడు. ఈ ఘటనతో ఆమె తీవ్ర వేదనకు లోనైంది. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. యూపీలోని కాన్పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

గుల్సాయిబా, సలీమ్‌లు 2022 జనవరిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2023 ఆగస్టు 30వ తేదీన సలీం ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లాడు. అప్పటి నుంచి గుల్సాబాయిను అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధించినట్టు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

Latest Videos

undefined

తన భర్త ఓల్డ్ ఫ్యాషన్డ్ అని, తాను వేసుకునే దుస్తులపైనా అభ్యంతరాలు చెబుతాడని ఆమె ఆరోపించింది. అక్టోబర్ 4న తనకు సౌదీ అరేబియా నుంచి వీడియో కాల్ చేశాడని వివరించింది. ఆ సందర్భంగా తన ఐ బ్రోస్ చూసి, వాటి గురించి ప్రశ్నించాడని తెలిపింది. ఆ కను బొమ్మలు సరిగా లేవని, వాటిని షేప్‌కు తీసుకురావడానికే చేయించానని వివరణ ఇచ్చినా ఆయన ఆగ్రహిస్తూనే ఉన్నాడని పేర్కొంది. 

Also Read : మెడిసిన్ బాటిళ్లు అన్నారు, తీరా చూస్తే మందు బాటిళ్లు.. డ్రై స్టేట్‌కు కొరియర్, కానీ..!

దీంతో సలీం తనను బెదిరించాడని, తాను వద్దని అభ్యంతరం చెప్పినా ముందుకు అడుగు వేశావని, ఐబ్రోస్ షేప్ చేయించుకున్నావని ఆగ్రహించినట్టు గుల్సాయిబా పేర్కొంది. ఈ రోజు నుంచి పెళ్లి బంధం నుంచి ఆమెకు విముక్తి ఇస్తానని చెప్పి మూడు సార్లు తలాఖ్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడని వివరించింది. ఎన్నిసార్లు మళ్లీ ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదని తెలిపింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. భర్త, అత్త సహా ఐదుగురి పై కేసు నమోదైంది.

click me!