యాపిల్ ఫోన్ సేఫేనా? కాదా? అనే విషయాన్ని ఇప్పుడు ఆ సంస్థ వెల్లడించాల్సి ఉన్నదని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఈ రోజు కొందరి యాపిల్ ఫోన్లకు హ్యాక్‌కు సంబంధించి ఓ నోటిఫికేషన్ వచ్చింది. అందులో స్టేట్ యాక్టర్స్ అని పేర్కొనడంతో అందరూ కేంద్ర ప్రభుత్వంపైకి వేళ్లు చూపారు.
న్యూఢిల్లీ: యాపిల్ ఫోన్ ప్రత్యేకతల్లో ప్రధానంగా చెప్పుకునేది డేటా సేఫ్టీ. యాపిల్ ఫోన్‌ను నుంచి డేటా చౌర్యం సాధ్యం కాదని, హ్యాక్ చేయడం దుస్సాధ్యం అని చెబుతారు. యాపిల్ బ్రాండ్ వ్యాల్యూకు ఇది కీలకమైన అంశం. అలాంటిది ఈ రోజు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సంచలన కామెంట్ చేశారు. యాపిల్ ఫోన్ సేఫా? కాదా? అనేది ఆ కంపెనీ కచ్చితంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ఈ రోజు ప్రతిపక్ష నేతల యాపిల్ ఫోన్‌లకు ఓ హ్యాకింగ్ వార్నింగ్ వచ్చింది. స్టేట్ అటాకర్లు మీ ఐఫోన్ టార్గెట్ చేసుకుని దాడులకు, హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారనేది ఆ వార్నింగ్ మెస్సేజీ సారాంశం. ఇది వరకే పెగాసెస్ నేపథ్యం ఉన్నందున ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వమే ప్రతిపక్షాలపై నిఘా వేస్తున్నాయని విమర్శించాయి.
After tdys "threat notifications" being recd by many people incldng MPs and those in geopolitics, we expectnApple to clarify the following
➡️if its devices are secure ;
➡️why these "threat notifications" are sent to people in over 150 countries ;
➡️bcoz apple has repeatedly…
undefined
ఈ వాదోపదవాదనలపై కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రియాక్ట్ అయ్యారు. ఇది ఎన్నికల సీజన్, ప్రతి ఒక్కరూ అనేక విధాల వాదనలు చేయడం సహజం అని రాజకీయ పార్టీల ఆరోపణలను కొట్టేసిన ఆయన ఈ ఉదంతంపై దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. అసలు ఆ నోటిఫికేషన్‌కు అర్థం ఏమిటో యాపిల్ సంస్థనే తెలుపాలని అన్నారు. అసలు వారి ప్లాట్ ఫామ్ హ్యాక్‌కు గురైందా? లేక సేఫ్‌గానే ఉన్నదా? ఆ నోటిఫికేషన్ నమ్మదగినదేనా? అనే విషయాలను ఆ సంస్థనే వివరించాల్సి ఉన్నదని తెలిపారు. దర్యాప్తు ప్రతి అంశాన్ని వెల్లడిస్తుందని చెప్పారు. ఆ నోటిఫికేషన్‌లోని స్టేట్ యాక్టర్స్ అని ఉన్నదని, దాని అర్థం ఏమిటో వివరించాలనీ ఆయన డిమాండ్ చేశారు.
Also Read: మీ టీచర్ రమ్మంటున్నదని చెప్పి స్టూడెంట్‌ను తీసుకెళ్లి హత్య.. టీచర్ బాయ్‌ఫ్రెండ్ అరెస్టు
కాగా, ఈ నోటిఫికేషన్‌లో స్టేట్ యాక్టర్స్ అంటే ప్రభుత్వ సంస్థలు కాదని యాపిల్ సంస్థ వివరణ ఇచ్చింది.